శబరిమల వివాదంపై మనోజ్ స్పందన
Send us your feedback to audioarticles@vaarta.com
మహిళలకు ప్రవేశం లేని శబరిమల కొండపై ఇకపై మహిళలు కూడా ప్రవేశించవచ్చు అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో చాలా పెద్ద రగడే జరిగింది. సుప్రీం కోర్టు తీర్పుపై కూడా భిన్నాభిప్రాయాలు వినపడుతున్నాయి. ఇలాంటి తరుణంలో సోషల్ మీడియాలో ఓ అభిమాని శబరిమల వివాదంపై చరణ్, మనోజ్ వంటి హీరోలు స్పందించాలంటూ తన అభిప్రాయాన్ని వెలిపరిచారు.
దీనిపై మనోజ్ స్పందిస్తూ ``పేదలకు తిండి, నీరు, చదవు అందించాలి.. ఇలాంటి విషయాల కోసం బాధపడాలి. దేవుడిపై నమ్మకం ఉంటే.. ఆయన తన సమస్యలను తానే పరిష్కరించుకోగలడు అని కూడా నమ్మాలి. మానవత్వం కోసం పోరాడాలని గౌరవంగా కోరుకుంటున్నాను`` అంటూ తన స్పందనను ట్విట్టర్ ద్వారా తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Diya Harini
Contact at support@indiaglitz.com