శ‌బ‌రిమ‌ల వివాదంపై మ‌నోజ్ స్పంద‌న‌

  • IndiaGlitz, [Thursday,November 01 2018]

మ‌హిళ‌ల‌కు ప్ర‌వేశం లేని శ‌బ‌రిమ‌ల కొండ‌పై ఇక‌పై మ‌హిళ‌లు కూడా ప్ర‌వేశించ‌వ‌చ్చు అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేప‌థ్యంలో చాలా పెద్ద ర‌గ‌డే జ‌రిగింది. సుప్రీం కోర్టు తీర్పుపై కూడా భిన్నాభిప్రాయాలు విన‌ప‌డుతున్నాయి. ఇలాంటి త‌రుణంలో సోష‌ల్ మీడియాలో ఓ అభిమాని శ‌బ‌రిమ‌ల వివాదంపై చ‌ర‌ణ్‌, మ‌నోజ్ వంటి హీరోలు స్పందించాలంటూ త‌న అభిప్రాయాన్ని వెలిప‌రిచారు.

దీనిపై మ‌నోజ్ స్పందిస్తూ ''పేద‌ల‌కు తిండి, నీరు, చ‌ద‌వు అందించాలి.. ఇలాంటి విష‌యాల కోసం బాధ‌ప‌డాలి. దేవుడిపై న‌మ్మ‌కం ఉంటే.. ఆయ‌న త‌న స‌మ‌స్య‌ల‌ను తానే ప‌రిష్క‌రించుకోగ‌ల‌డు అని కూడా న‌మ్మాలి. మాన‌వ‌త్వం కోసం పోరాడాల‌ని గౌర‌వంగా కోరుకుంటున్నాను'' అంటూ త‌న స్పంద‌న‌ను ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు.