రాజ‌కీయం చేయొద్దంటున్న మ‌నోజ్‌

  • IndiaGlitz, [Tuesday,October 23 2018]

'ప్ర‌జ‌ల‌కు ఏదో చేయాల‌నుకుంటున్నా.. దానికి రాజ‌కీయ రంగు పుల‌మొద్దు' అని అంటున్నాడు మంచు మ‌నోజ్‌. రీసెంట్‌గా తిరుప‌తిలో మ‌న‌శ్శాంతి కోసం ఉండాల‌నుకుంటున్నాన‌ని చెప్పి లెట‌ర్ రాసిన మ‌నోజ్ అన్న‌ట్లుగానే తిరుప‌తి చేరుకున్నాడు.

అత‌నికి ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. నాపై అపార‌మైన ప్రేమ‌ను చూపించిన ప్ర‌జ‌ల‌కు ధ‌న్య‌వాదాలు. ప్ర‌జ‌ల‌కు ఏదైనా మంచి చేయాల‌నుకుంటున్నాను. ఆ దృఢ చిత్తానికి రాజ‌కీయ రంగు పుల‌మ‌కండి అంటూ ట్విట్ట‌ర్ ద్వారా విజ్ఞ‌ప్తి చేశారు. అలాగే వ‌చ్చే ఏడాది మార్చిలో జ‌ర‌గ‌బోయే సినిమా కోసం సిద్ధ‌మ‌వుతున్నాను అంటూ కూడా మెసేజ్ చేశారు మ‌నోజ్‌.