మూడేళ్ల గ్యాప్ తర్వాత పాన్ ఇండియా సినిమాను అనౌన్స్ చేసిన మంచు మనోజ్
Send us your feedback to audioarticles@vaarta.com
మంచు మోహన్‌బాబు నట వారసులుగా కెరీర్ స్టార్ట్ చేసిన వారు లక్ష్మీ, విష్ణు, మనోజ్. వీరిలో మంచు మనోజ్ సినిమా రంగానికి మూడేళ్లుగా దూరంగా ఉంటూ వస్తున్నారు. ఎట్టకేలకు ఈరోజు ఆయన తన కొత్త సినిమాను అధికారికంగా అనౌన్స్ చేస్తూ వచ్చారు. ఈ సినిమాతో హీరోగానే కాదు.. నిర్మాతగా కూడా మారారు మంచు మనోజ్. కొన్ని రోజుల క్రితమే తాను నిర్మాతగా మారుతున్నానని ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎం ఎం ఆర్ట్స్ అనే బ్యానర్‌ను కూడా అనౌన్స్ చేశారు మనోజ్. అయితే ఆ సంరద్భంలో తన కొత్త సినిమా విశేషాలేవీ చెప్పలేదు.
అయితే మూడేళ్ల విరామానికి బ్రేక్ చెబుతూ మనోజ్ `అహం బ్రహ్మాస్మి` అనే సినిమా చేయబోతునట్లు ప్రకటించారు. విద్యానిర్వాణ, మంచు ఆనంద్ సమర్పణలో శ్రీకాంత్ రెడ్డి దర్శకుడిగా తల్లి నిర్మలా దేవితో కలిసి సినిమాను నిర్మించబోతునట్లు మంచు మనోజ్ పోస్టర్‌ను విడుదల చేశారు. టైటిల్ వినడానికి ఆధ్యాత్మికంగా ఉంది. మరి కాన్సెప్ట్ ఎలా ఉండబోతుందో చూడాలి. సినిమాను మార్చి 6న అధికారికంగా ప్రారంభించనున్నారు. ఆసక్తికరమైన విషయమేమంటే ఈ చిత్రాన్ని పాన్ ఇండియా చిత్రంగా విడుదల చేయడానికి మనోజ్ సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదలవుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com