మంచి మనసు చాటుకున్న మంచు మనోజ్
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా లాక్ డౌన్‌తో దేశ వ్యాప్తంగా ఉన్న వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సొంతూళ్లకు వెళ్లలేక.. ఉన్న చోట ఉండలేక.. తిండీ తిప్పల్లేక.. కడుపు కాల్చుకుండా.. కాళ్లు మండుతుంటే రోడ్డపై నడుచుకుంటూ వెళ్తున్నారు చాలా చోట్ల కార్మికులు. ఇలాంటి తరుణంలో కార్మికులను ఆదుకునేందుకు చాలా మంది సెలబ్రిటీలు, ట్రస్టులు ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో తన వంతుగా వలస కార్మికులకు అండగా నిలబడేందుకు యంగ్ హీరో మంచు మనోజ్ ముందుకొచ్చాడు. ఇవాళ ఆయన పుట్టిన రోజు కావడంతో ఈ మంచి పనికి శ్రీకారం చుట్టాడు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు వలస కార్మికులు హైదరాబాద్‌లో ఉంటూ ఇబ్బందులు పడుతున్నట్లు తన దృష్టికి రావడంతో టీమ్‌ను రంగంలోకి దింపాడు మనోజ్. వారికి స్వస్థలాలకు తరలించే బాధ్యతను తన భుజాన వేసుకుని ప్రత్యేక బస్సుల్లో ఇంటికి పంపడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు.
మున్ముంథు కొనసాగిస్తా..!
ఇవాళ హైదరాబాద్‌లోని మూసాపేట నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన పలువురిని రెండు బస్సుల్లో వారి స్వస్థలాలకు పంపారు. అంతేకాదు వారికి కావాల్సిన ఆహారం, మాస్క్‌లు, శానిటైజర్స్లు ఆయన దగ్గరుండి మరీ అందజేశారు. గురువారం కూడా మరో రెండు మూడు బస్సుల్లో వలస కూలీలను ఇళ్లకు పంపేందుకు మనోజ్ ఏర్పాట్లు చేస్తున్నాడు. మున్ముందు ఈ సేవలను మరింత విస్తరించనున్నట్టు మనోజ్ పేర్కొన్నాడు.
మెచ్చుకోవాల్సిందే..!
‘ఓ మంచి పని కోసం అందరి సాయం అవసరం. అందరూ తలో చేయి వస్తే వలస కార్మికులను ఇళ్లకు పంపొచ్చు. వలస కార్మికులను ఇళ్లకు పంపేందుకు బస్సులు ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాను. అనుమతి కావాలని కేంద్రాన్ని కోరగానే.. అనుమతించింది’ అని ట్విట్టర్ వేదికగా మనోజ్ తెలిపాడు. వెంటనే రంగంలోకి దిగిన టీమ్.. నగరంలో ఇబ్బందులు పడుతున్న వలస కూలీలను వారి స్వస్థలాలకు పంపే ప్రయత్నం ముమ్మరం చేశాడు. నిజంగా ఇబ్బందుల్లో ఉన్న వలస కార్మికులు ఈ సమయంలో మనోజ్ ఆదుకున్నాడంటే మెచ్చుకోదగ్గ విషయమే. ఇలా టాలీవుడ్ హీరోల మీవంతుగా మీరు సాయం చేయాలని పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా బాలీవుడ్లో వందలాది మందిని ముంబై నుంచి వారి స్వస్థలాలకు ప్రముఖ నటుడు, విలన్ పాత్రధారి సోనూ సూద్ ప్రత్యేక బస్సుల్లో తరలిస్తున్న విషయం తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments