Manchu Manoj : ఒక్కటైన మనోజ్- భూమా మౌనిక, భార్యను ముద్దాడుతూ మంచు వారబ్బాయి.. ఫోటోలు వైరల్

  • IndiaGlitz, [Saturday,March 04 2023]

సినీనటుడు మంచు మనోజ్ వివాహం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఘనంగా జరిగింది. దివంగత భూమా నాగిరెడ్డి- శోభ దంపతుల రెండో కుమార్తె మౌనికా రెడ్డి ఆయన పెళ్లాడారు. శుక్రవారం రాత్రి ఫిలింనగర్‌లోని మంచు లక్ష్మీ ఇంట్లో వీరి వివాహం కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కొత్త జంటకు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. భార్యను ముద్దాడుతూ మనోజ్ షేర్ చేసిన ఫోటో వైరల్ అవుతోంది. కొత్త జంట చూడముచ్చటగా వుంది. గోల్డ్ కలర్ పట్టు కుర్తా, దోతిలో మంచు మనోజ్.. ఆకుపచ్చ, పింక్ కలర్ పట్టుచీరలో మౌనిక ఎంతో అందంగా కనిపించారు. ప్రస్తుతం మనోజ్-మౌనికా రెడ్డిల పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పెళ్లికి పెద్దగా మంచు లక్ష్మీ:

ఇదిలావుండగా తమ్ముడి పెళ్లికి మంచు లక్ష్మీ పెద్దగా వ్యవహరించారు. తన ఇంటినే వివాహ వేదికగా మార్చిన ఆమె.. మెహందీ , మనోజ్‌ను పెళ్లి కొడుకుగా చేయడం వంటి పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. మనోజ్-మౌనికా రెడ్డిల పెళ్లికి మోహన్ బాబు సతీసమేతంగా హాజరయ్యారు. అటు మౌనిక వైపు నుంచి ఆమె అక్క, మాజీ మంత్రి అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్ హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. కుటుంబ సభ్యులంతా కలిసి గ్రూప్ ఫోటోకి ఫోజులిచ్చారు.

ప్రణతితో విడాకుల తర్వాత ఒంటరిగానే మనోజ్:

కాగా.. మంచు మనోజ్ తొలుత ప్రణతి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే వ్యక్తిగత కారణాలతో ఈ జంట 2019లో విడాకులు తీసుకుంది. ఆనాటి నుంచి మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఎన్నోసార్లు మీడియాలో, సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. కానీ అవన్నీ గాలి వార్తలేనని తేలిపోయింది. కానీ ఇప్పుడు తాజా ఘటన వెనక కథేంటో అర్ధం కావడం లేదు. ఇక భూమా మౌనికా రెడ్డి విషయానికి వస్తే, ఇమెకు కూడా ఆల్రెడి పెళ్లయ్యింది. బెంగళూరుకు చెందిన గణేష్ రెడ్డితో మొదటి వివాహం జరిగింది. ఈ దంపతులకు ఐదేళ్ల బాబు కూడా వున్నాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ దంపతులు రెండేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. గణేష్‌ నుంచి వీడిపోయాక.. మౌనికా రెడ్డి హైదరాబాద్‌లోనే వుంటున్నారు.

More News

Puli Meka:జీ 5లో 75 మిలియ‌న్ వ్యూయింగ్ మినిట్స్‌ను సాధించిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ ‘పులి మేక’

వ‌న్ ఆఫ్ ది టాప్ మోస్ట్ డిజిట‌ల్ కంటెంట్ ప్రొవైడ‌ర్స్‌లో త‌న‌దైన స్థానాన్ని ద‌క్కించుకుంది జీ 5.

Manchu Manoj:యస్.. మౌనికా రెడ్డిని పెళ్లాడబోతున్నా , ఎట్టకేలకు ఓపెన్ అయిన మనోజ్... ఈ రోజే వెడ్డింగ్

ఊహాగానాలే నిజమయ్యాయి. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమారుడు మనోజ్ రెండో పెళ్లికి సిద్ధమయ్యారు.

Allu Arjun:అర్జున్ రెడ్డి డైరెక్టర్‌తో అల్లు అర్జున్.. టాలీవుడ్ జనాలకు ఇక పునకాలే

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. టాలీవుడ్‌ జనాలంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న క్రేజీ కాంబో సెట్ అయ్యింది.

Yandamuri Veerendranath:యండమూరి వీరేంద్రనాథ్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం

ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే..

Sushmita Sen :సుస్మితా సేన్‌కు హార్ట్ ఎటాక్.. తీరిగ్గా చెప్పిన మాజీ మిస్ యూనివర్స్, ఉలిక్కిపడ్డ ఫిల్మ్ ఇండస్ట్రీ

సీనియర్ హీరోయిన్ , మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ గుండెపోటుకు గురయ్యారు.