మనోజ్ అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి...
Send us your feedback to audioarticles@vaarta.com
'ఒక్కడు మిగిలాడు, మరో చిత్రంలో నటిస్తున్నాను. నటుడిగా ఈ రెండే నా ఆఖరి చిత్రాలు, అందరికీ ధన్యవాదాలు' అంటూ మంచు మనోజ్ ట్విట్టర్‌లో చేసిన పోస్ట్ సెన్సేషన్ అయ్యింది. తర్వాత ఏమయ్యిందో ఏమో కానీ మనోజ్ ఆ ట్వీట్‌ను తొలగించారు. కానీ మనోజ్ మాత్రం తన కొత్త సినిమా గురించి చెప్పే ప్రయత్నంలోనే అలా చేశానని, అయితే తాను పెట్టిన మెసేజ్‌ను రకరకాలుగా అర్థం చేసుకున్నారు.
మీడియా మిత్రుల నుండి ఇంత రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు. నేను చేయబోయే కొత్త సినిమా గురించి కొత్తగా చెప్పాలనుకుంటున్నాను. నా కొత్త సినిమా గురించి చెప్పాలంటే ఈ వేడి చల్లారాలి..ఓం శాంతి అంటూ మళ్ళీ మెసేజ్ పెట్టాడు. ప్రస్తుం మనోజ్ 'ఒక్కడు మిగిలాడు' చిత్రంలో ఎల్.టి.టి.ఇ అధినేత ప్రభాకరన్‌గా కనిపించనున్నారు. అజయ్ అంగ్రూస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మనోజ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com