ఇన్‌సల్ట్ చెయ్యొద్దంటున్న హీరో
Send us your feedback to audioarticles@vaarta.com
హీరో మంచు మనోజ్ ఇప్పుడు సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకున్నాడు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ సమజానికి సంబంధించిన విషయాల్లో భాగమయ్యేలా పనులు చేస్తున్నారు. ఇటీవల ఓ పేషంట్‌కు రక్తం కావాలని మనోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే నెటిజన్స్ సకాలంలో స్పందించి రక్తం అందేలా చేశారు. పెషంట్ బ్రతికారు.
దీంతో పెషంట్ బంధువు ఒకరు `థాంక్స్ అన్నా..నీ వల్ల ఒక కుటుంబం ఆనందంగాఉంది. నువ్వు మెసేజ్ పోస్ట్ చేయడం వల్లే అంత మంది రక్తం అందించడానికి ముందుకు వచ్చారు` అని ట్వీట్ చేశారు. దానికి ప్రతిగా మనోజ్ `దయచేసి థాంక్స్ చెప్పి నన్ను ఇన్‌సల్ట్ చెయ్యొద్దు తమ్ముడు. ఈ ప్రపంచంలో మనుషులంతా కలిసి ఉండాలి. ఒకరి ఒకరు తోడుగా ఉండాలి. లవ్ యు ఆల్` అంటూ మెసేజ్‌ను పోస్ట్ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments