ఆస్తులు అమ్మమని దేవుడు చెప్పాడా?.. వివరణ ఇవ్వండి!
Send us your feedback to audioarticles@vaarta.com
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల వెంకన్న ఆస్తుల విక్రయం అంశం ఏపీలో తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. మూడ్రోజులుగా ఈ వ్యవహారంపై టీడీపీ- వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఈ వ్యవహారంపై పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. తాజాగా దీనిపై తిరుపతి వాసి, యంగ్ హీరో మంచు మనోజ్ స్పందించాడు. సోమవారం నాడు ఓ లేఖ రాసిన మనోజ్.. ఇందులో ప్రభుత్వాన్ని పరోక్షంగా విమర్శిస్తూనే ప్రశ్నల వర్షం కురిపించాడు.
తిరుపతి వాడిగా అడుగుతున్నా..!
‘టీటీడీ ఆస్తులు అమ్మమని దేవుడేమన్నా చెప్పాడా?. కరోనా సంక్షోభంలో రోజుకు లక్ష మందికి ఆకలి తీర్చమని కూడా దేవుడు ఏమన్నా చెప్పాడా?. చేసేది.. చెప్పేది అంతా టీటీడీ పాలక మండలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆస్తులను, కొండకి వచ్చిన లక్షలాది మందిని, సుప్రభాత సేవకి టైమ్ అయ్యింది నిద్ర లేవాలి.. అని శ్రీహరిని సైతం కంట్రోల్ చేసేది టీటీడీ పాలక మండలి. కొండపైన ఉన్న వడ్డీ కాసులవాడి ఆస్తులు అమ్మకానికి వచ్చాయి అంటే గోవిందా..? గోవిందా..? అని అరచిన ఈ గొంతు కొంచెం తడబడింది. మోసం జరగట్లేదు అని తెలుసు. ఎందుకంటే ఇన్సైడ్ ట్రేడింగ్ లాగా కాకుండా వేలం వేసి అందరి ముందూ అందరు చూస్తుండగానే అమ్మకం జరుపుతారు. కానీ, ఎందుకు అమ్ముతున్నారు? అని పాలక మండలిని కాస్త వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నా. వివరణ మాత్రమే. ఏమీ లేదు సార్.. ఇంత పెద్ద కొండ మాకు అండగా ఉంది అని చూస్తూ మురిసిపోయే తిరుపతి వాడిని కాబట్టి ఆపుకోలేక అడుగుతున్నా సార్.. అంతే. జై హింద్..’ అని మనోజ్ తన లేఖను ముగించాడు.
#TTD ???? pic.twitter.com/71PaFMPWbz
— MM*????❤️ (@HeroManoj1) May 25, 2020
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments