ఆస్తులు అమ్మమని దేవుడు చెప్పాడా?.. వివరణ ఇవ్వండి!

  • IndiaGlitz, [Monday,May 25 2020]

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల వెంకన్న ఆస్తుల విక్రయం అంశం ఏపీలో తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. మూడ్రోజులుగా ఈ వ్యవహారంపై టీడీపీ- వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఈ వ్యవహారంపై పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. తాజాగా దీనిపై తిరుపతి వాసి, యంగ్ హీరో మంచు మనోజ్ స్పందించాడు. సోమవారం నాడు ఓ లేఖ రాసిన మనోజ్.. ఇందులో ప్రభుత్వాన్ని పరోక్షంగా విమర్శిస్తూనే ప్రశ్నల వర్షం కురిపించాడు.

తిరుపతి వాడిగా అడుగుతున్నా..!

‘టీటీడీ ఆస్తులు అమ్మమ‌ని దేవుడేమ‌న్నా చెప్పాడా?. క‌రోనా సంక్షోభంలో రోజుకు ల‌క్ష మందికి ఆక‌లి తీర్చమ‌ని కూడా దేవుడు ఏమ‌న్నా చెప్పాడా?. చేసేది.. చెప్పేది అంతా టీటీడీ పాల‌క మండ‌లి. ప్రపంచ‌వ్యాప్తంగా ఉన్న ఆస్తుల‌ను, కొండ‌కి వ‌చ్చిన ల‌క్షలాది మందిని, సుప్రభాత సేవ‌కి టైమ్ అయ్యింది నిద్ర లేవాలి.. అని శ్రీ‌హ‌రిని సైతం కంట్రోల్ చేసేది టీటీడీ పాల‌క మండ‌లి. కొండ‌పైన ఉన్న వ‌డ్డీ కాసుల‌వాడి ఆస్తులు అమ్మకానికి వ‌చ్చాయి అంటే గోవిందా..? గోవిందా..? అని అర‌చిన ఈ గొంతు కొంచెం త‌డ‌బ‌డింది. మోసం జ‌ర‌గ‌ట్లేదు అని తెలుసు. ఎందుకంటే ఇన్‌సైడ్ ట్రేడింగ్ లాగా కాకుండా వేలం వేసి అంద‌రి ముందూ అంద‌రు చూస్తుండ‌గానే అమ్మకం జ‌రుపుతారు. కానీ, ఎందుకు అమ్ముతున్నారు? అని పాల‌క మండ‌లిని కాస్త వివ‌ర‌ణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నా. వివ‌ర‌ణ మాత్రమే. ఏమీ లేదు సార్‌.. ఇంత పెద్ద కొండ మాకు అండ‌గా ఉంది అని చూస్తూ మురిసిపోయే తిరుప‌తి వాడిని కాబ‌ట్టి ఆపుకోలేక అడుగుతున్నా సార్‌.. అంతే. జై హింద్‌..’ అని మనోజ్ తన లేఖను ముగించాడు.

 

More News

దిల్‌రాజు మ‌రో బాలీవుడ్ ప్రాజెక్ట్‌

తెలుగులో స్టార్ ప్రొడ్యూస‌ర్‌గా రాణిస్తోన్న దిల్‌రాజు తెలుగుతో పాటు హిందీ సినిమాలను కూడా నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

వెంకటేష్ - త్రివిక్రమ్ చిత్రంలో మరో హీరో

అగ్ర ద‌ర్శ‌కుల్లో ఒక‌రిగా మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ రాణిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ త‌న ద‌ర్శ‌క‌త్వంలో

నేను కూడా అవ‌మానాల‌ను ఎదుర్కొన్నా:  ఐశ్వ‌ర్యా రాజేశ్‌

తెలుగుతో పాటు త‌మిళంలోనూ హీరోయిన్‌గా త‌నకంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకుంది ఐశ్వ‌ర్యా రాజేశ్‌. అయితే త‌న‌కు స‌క్సెస్ అంత సుల‌భంగా రాలేద‌ని ఐశ్వ‌ర్యా రాజేశ్ అంటున్నారు.

చిరు చిన్న‌ల్లుడి చ‌పాతీలు.. శ్రీజ సెటైర్‌

లాక్‌డౌన్ కార‌ణంగా థియేట‌ర్స్ బంద్ కావ‌డం, షూటింగ్స్ ఆగిపోవ‌డంతో సినీ తార‌లంద‌ర ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. వీరంద‌రూ కొత్త విష‌యాలు నేర్చుకోవ‌డ‌మే కాకుండా.

టీటీడీ ఆస్థులు అమ్మ‌కం.. నాగ‌బాబు ట్వీట్‌

మెగాబ్రదర్ నాగబాబు లాక్డౌన్ వల్ల షూటింగ్స్‌కే ప‌రిమిత‌మ‌య్యారు. దీంతో ఈయ‌న త‌న భావాల‌ను సోష‌ల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు.