'ఒక్కడు మిగిలాడు' చిత్రంలో ఎల్.టి.టి.ఇ. ప్రభాకరన్ పాత్రలో మంచు మనోజ్
Send us your feedback to audioarticles@vaarta.com
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగా రూపొందుతున్న చిత్రం `ఒక్కడు మిగిలాడు`. దీపావళి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదలైంది. ఫస్ట్‌లుక్‌కు ఆడియెన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చాలా గ్యాప్ తర్వాత మనోజ్ ఎల్.టి.టి.ఇ. నాయకుడు ప్రభాకరన్‌గా పవర్‌ఫుల్ పాత్రలో కనపడబోతున్నాడు. అజయ్ అండ్ర్యూస్ నౌతాక్కి దర్శకత్వంలో ఎస్.ఎన్.రెడ్డి, లక్ష్మీకాంత్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు ఎస్.ఎన్.రెడ్డి, లక్ష్మీకాంత్ మాట్లాడుతూ - ```ఒక్కడు మిగిలాడు` చిత్రంలో వేలుపిళ్ళై ప్రభాకరన్ పాత్రలో మంచు మనోజ్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశాం. ఈ చిత్రం శ్రీలంకలోని 15 లక్షల మంది శరణార్థులు కోసం 1990లో జరిగిన యుద్ధ నేపథ్యంలో సాగుతుంది. మంచు మనోజ్‌గారు చాలా బాగా కో ఆపరేట్ చేశారు. ప్రభాకరన్ గెటప్‌కోసం వెయిట్ కూడా పెరిగాడు. వైజాగ్ దగ్గరలోని పరవాడ ప్రాంతంలో యుద్ధ సన్నివేశాలను 25 రోజుల పాటు చిత్రీకరించాం. మనోజ్ ఇనెటన్స్‌తో కూడిన యాక్షన్, డైలాగ్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. ఈ సినిమా మనోజ్ కెరీర్‌లోనే బెస్ట్ మూవీగా నిలుస్తుంది`` అన్నారు.
బ్యానర్ః ఎస్.ఎన్.ఆర్.ఫిలింస్ ఇండియా ప్రై.లి., న్యూ ఎంపైర్ సెల్యూలాయిడ్స్, ఆర్ట్ః పి.ఎస్.వర్మ, సినిమాటోగ్రఫీః వి.కె.రామరాజు, ఎడిటర్ః కార్తీక శ్రీనివాస్, స్క్రీన్ ప్లేః గోపీ మోహన్, మ్యూజిక్ః శివ నందిగామ, నిర్మాతః ఎస్.ఎన్.రెడ్డి, లక్ష్మీకాంత్, దర్శకత్వంః అజయ్ అండ్ర్యూస్ నౌతాక్కి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments