చరణ్ కు కుదరలేదు..చిరంజీవిగారు చేశారు: మనోజ్

  • IndiaGlitz, [Sunday,February 26 2017]

మంచు మ‌నోజ్ హీరోగా స‌త్య ఎస్‌.కె ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన గుంటూరోడు సినిమా మార్చి 3న విడుద‌ల‌వుతుంది. ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవ‌ర్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే దీని వెనుక క‌థ‌ను మ‌నోజ్ ఈరోజు ఇంట‌ర్వ్యూ సంద‌ర్భంగా తెలియ‌జేశారు. ముందు మ‌నోజ్ వాయిస్ ఓవ‌ర్ చెప్ప‌మ‌ని చ‌ర‌ణ్‌ను అడిగాడ‌ట‌. అయితే తాను హైద‌రాబాద్‌లో లేను..రావ‌డానికి ప‌ది రోజులు ప‌డుతుంది. వ‌చ్చిన త‌ర్వాత త‌ప్ప‌కుండా చెబుతాన‌ని అన్నాడ‌ట‌.
అయితే సెన్సార్ టైం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో మ‌నోజ్..మ‌రుస‌టి రోజు తండ్రి మోహ‌న్‌బాబుతో క‌లిసి చిరంజీవి ఇంటికి అల్పాహారానికి వెళ్ళిన‌ప్పుడు త‌న కోరిక‌ను చెప్పాడ‌ట‌. చిరు వెంట‌నే వాయిస్ ఓవ‌ర్ చెప్ప‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడ‌ట‌. మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడుతో బిజీగా ఉన్న‌ప్ప‌టికీ చిరంజీవిగారు స‌మ‌యం తీసుకుని వాయిస్ ఓవ‌ర్ చెప్ప‌డం చాలా గ్రేట్ అని ఈ సంద‌ర్భంగా మ‌నోజ్ తెలిపారు.

More News

దేశ ప్రజలందరూ గర్వపడే చిత్రం 'ఘాజీ' - వెంకయ్య నాయుడు

దగ్గుబాటి రానా హీరోగా సంకల్ప్ దర్శకత్వంలో మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్,పివిపి సినిమా సంయుక్తంగా నిర్మించిన సినిమా 'ఘాజీ'.

'గుంటూరోడు' చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తాను - మంచు మనోజ్

మంచు మనోజ్,ప్రగ్యా జైశ్వాల్ హీరో హీరోయిన్లుగా క్లాప్స్ అండ్ విజిల్స్ బ్యానర్ లో ఎస్.కె.సత్య దర్శకత్వంలో వరుణ్ నిర్మించిన చిత్రం 'గుంటూరోడు'. ఈ సినిమా మార్చి 3న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా మంచు మనోజ్ తో ఇంటర్వ్యూ...

ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికలు ఆదివారం హైదరాబాద్ సోమాజీగూడలోని ప్రెస్ క్లబ్ లో జరిగాయి.

బన్నితో సినిమా చేస్తున్నాను: లింగుస్వామి

పందెంకోడి సినిమాతో తెలుగు,తమిళంలో పెద్ద హిట్ కొట్టిన దర్శకుడు ఎన్.లింగుస్వామి దర్శకత్వంలో

తెలుగు సినీ పరిశ్రమ మంచి నిర్మాతనే కాదు, మంచి వ్యక్తిని కోల్పోయింది: బాలకృష్ణ

'ప్రముఖ సినీ నిర్మాత కె.సి.శేఖర్ బాబు కన్నుమూయడం చాలా బాధాకరం.