కింగ్ నాగార్జున రిలీజ్ చేసిన మంచు లక్ష్మి 'వైఫ్ ఆఫ్ రామ్' టీజర్

  • IndiaGlitz, [Friday,April 27 2018]

ఇన్నోవేటివ్  థాట్స్ ను ఇంటెలిజెంట్ గా ప్రజెంట్ చేయడం నేటి దర్శకుల స్టైల్. ఏం చెప్పినా కొత్తగా చెప్పాలన్న ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి ఆలోచనలున్న కథే 'వైఫ్ ఆఫ్ రామ్'. మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ మూవీ టీజర్ ను అక్కినేని నాగార్జున ట్విట్టర్ ద్వారాగా విడుదల చేశారు.

టీజర్ చూసిన వెంటనే నాగ్ ఒక్కసారిగా సర్ ప్రైజ్ అయ్యారు. క్షణంక్షణం ఉత్కంఠను రేకెత్తించేలా ఉందన్నాడు. టీజర్ చూస్తే సినిమా ఎప్పుడు చూడాలా అన్న ఉత్సుకత పెరిగిపోయిందని, మంచు లక్ష్మి చేసిన ఈ ప్రయత్నం అద్భుతంగా ఉందని మెచ్చుకున్నాడు. రెగ్యులర్ ఫార్మాట్ కు భిన్నంగా, టీజర్ లో ప్రతి ఫ్రేమ్ ఇంట్రెస్టింగ్ గా ఉందని.. తనకైతే ఈ 'వైఫ్ ఆఫ్ రామ్' టీజర్ విపరీతంగా నచ్చిందని చెప్పారు.

రాజమౌళి వద్ద 'ఈగ', 'బాహుబలి-1' చిత్రాలకు అసిస్టెంట్గా పనిచేసిన విజయ్ యలకంటి ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. మానవ సంబంధాలు, భావోద్వేగాల చుట్టూ అల్లుకున్న కథ ఇది. రామ్ ను పై నుంచి తోసేసి చంపేశారు అన్న మంచు లక్ష్మి డైలాగ్ తో మొదలై..  ఈ సైకలాజికల్ థ్రిల్లర్ గురించి

దర్శకుడు విజయ్ యలకంటి మాట్లాడుతూ ఇది న్యూ ఏజ్ సినిమా. రెగ్యులర్ థ్రిల్లర్స్ లా కాకుండా.. ఈ థ్రిల్లర్ కు ఫ్యామిలీ అనుబంధాల్ని కూడా జోడించాం. వైఫ్ ఆఫ్ రామ్ గా మంచు లక్ష్మి కెరీర్ లోనే ఇది బెస్ట్ గా నిలిచే పాత్ర అవుతుంది. ప్రతి క్షణం ప్రేక్షకులను థ్రిల్ కు గురి చేసే అంశాలు చాలా ఉంటాయి. ఊహించని ట్విస్ట్ లతో సాగే ఈ కథ, కథనం ఖచ్చితంగా చూసే ప్రతి ఒక్కరికీ సరికొత్త అనుభూతినిస్తుంది అన్నాడు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోన్న ఈ మూవీని.. కృతి ప్రసాద్, విద్యా నిర్వాణ మంచు, ఆనంద్ సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మంచు ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

మంచు లక్ష్మి టైటిల్ పాత్రలో నటిస్తోన్న 'వైఫ్ ఆఫ్ రామ్'లో సమ్రాట్ రెడ్డి, ఆదర్శ్ బాలకృష్ణ, ప్రియదర్శి, శ్రీకాంత్ అయ్యర్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.. సాంకేతిక నిపుణులు.. ఎడిటర్ : తమ్మిరాజు,  డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : సామల భార్గవ్, సంగీతం : రఘు దీక్షిత్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సుహాసిన రాహుల్, మాటలు : సందీప్ గుంటా, ప్రొడక్షన్ డిజైనర్ : దీప్, పి.ఆర్.వో.: జి.ఎస్.కే మీడియా గ్రూప్, నిర్మాణం : పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, మంచు ఎంటర్టైన్మెంట్స్, రచన, దర్శకత్వం : విజయ్ యెలకంటి.

More News

'సడి' షూటింగ్‌ ప్రారంభం

భాను ఎంటర్‌టైన్‌మెంట్స్‌- `శ్రీ సాయి అమృతల‌క్ష్మి క్రియేషన్స్ బేన‌ర్స్ పై గోదారి భానుచంద‌ర్  నిర్మిస్తోన్న చిత్రం ‘సడి’.

జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న'సాక్ష్యం'

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజ హెగ్డే జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'సాక్ష్యం'.

'నీతోనే హాయ్‌..హాయ్‌' తొలి షెడ్యూల్ పూర్తి!!

కెఎస్‌పి ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై  య‌ల‌మంచిలి ప్ర‌వీణ్ స‌మ‌ర్ప‌ణ‌లో   డా.ఎ.స్. కీర్తి, డా.జి.పార్థ‌సార‌థి రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం 'నీతోనే హాయ్ హాయ్‌'. బియ‌న్ రెడ్డి అభిన‌య ద‌ర్శ‌కుడు.

అల్లు అర్జున్ కెరీర్ లో బెస్ట్ ఫెర్‌ఫార్మెన్స్ ఫిల్మ్ గా నిలుస్తుంది - నిర్మాత ల‌గ‌డ‌పాటి శ్రీధ‌ర్‌

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న చిత్రం “నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా”.

అప్పుడు వ‌ర్మ‌.. ఇప్పుడు సందీప్ రెడ్డి

'అర్జున్ రెడ్డి'.. తెలుగునాట‌ ఈ సినిమా ఒక సంచలనం. విజయ్ దేవరకొండను యూత్ స్టార్‌గా మార్చిన చిత్రమిది. ఫస్ట్ ఫిల్మ్‌నే బోల్డ్ మూవీగా రూపొందించి.. అటు ప్రేక్షకులతో పాటు