Manchu Manoj : మనోజ్ రెండో పెళ్లిపై ఊహాగానాలు.. మంచు లక్ష్మీ ఏమన్నారంటే
Send us your feedback to audioarticles@vaarta.com
కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు రెండో కుమారుడు మంచు మనోజ్ రెండో పెళ్లికి రెడీ అవుతున్నారా అంటూ గత కొన్నినెలలుగా సోషల్ మీడియా, మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని బలమైన రాజకీయ కుటుంబాల్లో ఒకటైన భూమా ఫ్యామిలీకి ఆయన అల్లుడు కాబోతున్నాడని వార్తలు గుప్పుమంటున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. గతేడాది హైదరాబాద్ నగరంలోని సీతాఫల్ మండిలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్దకు మంచు మనోజ్ వచ్చారు. ఆయనొక్కరే వచ్చుంటే ఏముండేది కాదు.. కానీ మనోజ్ వెంట దివంగత భూమా నాగిరెడ్డి చిన్న కుమార్తె మౌనిక రెడ్డి రావడం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరూ కలిసి వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో మనోజ్- మౌనికా రెడ్డిలు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ మీడియా కోడై కూస్తోంది. ఆ తర్వాత చాలా వేదికలపై వీరిద్దరూ జంటగా కనిపించడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. కానీ దీనిపై ఇరు కుటుంబాలు కానీ, మనోజ్- మౌనికాలు కానీ స్పందించలేదు.
శ్రీకాళహస్తి ఆలయానికి మంచు లక్ష్మీ:
తాజాగా మనోజ్ రెండో వివాహంపై ఆయన సోదరి, సినీనటి మంచు లక్ష్మీప్రసన్న స్పందించారు. చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తికి వచ్చిన ఆమెను మీడియా ఈ విషయంపై ప్రశ్నించగా.. గుడిలో వ్యక్తిగత విషయాలు అడగటం కరెక్ట్ కాదన్నారు. మనోజ్ పెళ్లికి సంబంధించి తనకు ఎలాంటి వివరాలు తెలియదని, తమ్ముడి వివాహం తన పరిధిలో లేదని లక్ష్మీ స్పష్టం చేశారు.
ప్రణతితో విడాకుల తర్వాత ఒంటరిగానే మనోజ్:
కాగా.. మంచు మనోజ్ తొలుత ప్రణతి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే వ్యక్తిగత కారణాలతో ఈ జంట 2019లో విడాకులు తీసుకుంది. ఆనాటి నుంచి మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఎన్నోసార్లు మీడియాలో, సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. కానీ అవన్నీ గాలి వార్తలేనని తేలిపోయింది. కానీ ఇప్పుడు తాజా ఘటన వెనక కథేంటో అర్ధం కావడం లేదు. ఇక భూమా మౌనికా రెడ్డి విషయానికి వస్తే, ఇమెకు కూడా ఆల్రెడి పెళ్లయ్యింది. బెంగళూరుకు చెందిన గణేష్ రెడ్డితో మొదటి వివాహం జరిగింది. ఈ దంపతులకు ఐదేళ్ల బాబు కూడా వున్నాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ దంపతులు రెండేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. గణేష్ నుంచి వీడిపోయాక.. మౌనికా రెడ్డి హైదరాబాద్‌లోనే వుంటున్నారు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout