మంచు లక్ష్మీకి యాక్సిడెంట్... రక్తం కారుతున్న ఫోటోలు వైరల్, అసలు ఏమైందంటే?
Send us your feedback to audioarticles@vaarta.com
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ ప్రసన్న సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా వుంటారు. సినిమాలు, షూటింగ్ విషయాలతో పాటు వ్యక్తిగత వివరాలను పంచుకుంటూ అభిమానులతో టచ్‌లో వుంటారు. తాజాగా లక్ష్మీప్రసన్న పోస్ట్ చేసిన ఓ ఫోటో అభిమానులను, టాలీవుడ్‌ను కలవరపాటుకు గురిచేసింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసిన ఫోటోలో చేతి వేలికి, మోకాలికి గాయమై రక్తం కారుతోంది.
ఇది చూసిన ఫ్యాన్స్ ఉలిక్కిపడ్డారు. వెంటనే ఏమైంది మేడమ్.. మీరు బాగానే వున్నారా అంటూ ప్రశ్నల వర్షం కురిసింది. అయితే... అవి నిజమైన గాయాలు కావట.. రియల్ యాక్సిడెంట్ కాదు, రీల్ యాక్సిడెంట్! షూటింగ్ కోసం లక్ష్మీ ప్రసన్న అలా రెడీ అయ్యారట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలియజేశారు. అంతేకాదు తన గురించి బాధపడినందుకు లక్ష్మీప్రసన్న అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ ఏడాది 'పిట్టకథలు' యాంథాలజీతో లక్ష్మీ మంచు ఓటీటీ ప్రేక్షకులను అలరించారు. అలాగే రెండు మూడు టీవీ షోల్లోనూ సందడి చేశారు.
ప్రస్తుతం లక్ష్మీ ప్రసన్న చేతిలో మూడు నాలుగు సినిమాలు వున్నాయి. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ సినిమాలో ఆమె నటిస్తున్నారు. దీనిలో భాగంగా ఓ ఫైట్ సీన్ కోసం తీసిన మేకప్‌ను మంచు లక్ష్మీ తన ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు. అలాగే, ఆమె రెండు తమిళ సినిమాలు కూడా చేస్తున్నట్లు టాలీవుడ్ టాక్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com