జీవితం ఇంతే అనుకుంటే నరకం..జీవితం ఎంతో అనుకుంటే స్వర్గం : మంచు లక్ష్మి ప్రసన్న
Send us your feedback to audioarticles@vaarta.com
నటిగా..నిర్మాతగా ... టాక్ షో హోస్ట్ గా ... ఇలా తను ప్రవేశించిన ప్రతి రంగంలో విజయం సాధించి..తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్న బహుముఖ ప్రజ్నాశాలి మంచు లక్ష్మి ప్రసన్న. మోహన్ బాబు కుమార్తెగా తెలుగు తెరకు పరిచయమై..అనతి కాలంలోనే తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న లక్ష్మి ప్రసన్న పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా లక్ష్మి ప్రసన్న గురించి ఆసక్తికర విషయాలు మీకోసం ..
చెన్నైలో చదువు ...
లక్ష్మి ప్రసన్న పుట్టి పెరిగింది..చదువుకుంది అంతా చెన్నైలోనే. అందుచేత తెలుగు అర్ధం అవుతుంది కానీ రాయడం..చదవడం రాదు. ఎవరైనా స్ర్కిప్ట్ ఇస్తే ... దానిని ఇంగ్లీషులోకి ట్రాన్స్ లేట్ చేయించుకుని చదువుకుంటుంది. తెలుగు చదవడం..రాయడం రానందుకు బాధపడుతుంటుంది. తెలుగుతో పాటు ఫారిన్ లాంగ్వేజ్ స్ నేర్చుకోవాలని తపిస్తుంటుంది.
నాన్నేగురువు ..
చిన్నప్పటి నుంచి మోహన్ బాబు విష్ణు, మనోజ్, లక్ష్మి ప్రసన్నను క్రమశిక్షణతో పెంచారు. ఆ క్రమశిక్షణ ఇప్పుడు ఎంతో ఉపయోగపడుతుందని ఫీల్ అవుతుంటుంది. అమెరికాలో ఉండాలా ...? లేక ఇక్కడకు రావాలా ..? ఇక్కడకు వస్తే తెలుగు రాదు..తెలుగు ఇండస్ట్రీలో ఏం చేయాలి ..? అని తెలియని అయోమయంలో ఉన్నప్పుడు నాన్నగారు చెప్పిన మాటలు ఒక టానిక్ లా పనిచేసాయంటోంది. ఇంతకీ లక్ష్మిప్రసన్నకి మోహన్ బాబు చెప్పిన మాట ఏమిటంటే..జీవితం ఇంతే అనుకుంటే నరకం..జీవితం ఎంతో అనుకుంటే స్వర్గం. ఇప్పటికీ ఎప్పుడైనా డిప్రషన్ లో ఉంటే ఈ మాటలు గుర్తు చేసుకుంటుంది.
ఏది ప్లాన్ చేయలేదు ..
అమెరికా నుంచి హైదరాబాద్ ఓ ఫంక్షన్ కి వచ్చింది.ఆతర్వాత నటిగా, నిర్మాతగా, హోస్ట్ గా బిజీ అయిపోయింది. ఏది ప్లాన్ చేసి చేసింది కాదు.అవకాశాలు వచ్చాయి.ఆ .. వచ్చిన అవకాశాలు ఆసక్తి కలిగించడంతో సద్వినియోగం చేసుకుంటూ కెరీర్ లో ముందుకు వెళుతుంది. అనగనగా ఓ థీరుడు సినిమాలో ఇరేంద్రి పాత్ర అద్భుత అభినయం కనబరిచి తొలి ప్రయత్నంలోనే నంది అవార్డు సొంతం చేసుకోవడం విశేషం.
ఎక్స్ పోజింగ్ కి దూరం ..
ఎక్స్ పోజింగ్ గురించి అడిగితే .. టాక్ షోలో ఎక్స్ పోజింగ్ చేయను. కానీ చాలా మంది అమ్మాయిలు కలసి మీరు చాలా హాట్ గా అన్నారంటారు. అంటే ఎక్స్ పోజింగ్ అనేది ఎనర్జిలో ఉంటుంది అనేది నా నమ్మకం అంటోంది. మంచు లక్ష్మి అంటే నేను మాత్రమే కాదు. నా వెనుక నాన్నగారు ఉన్నారు. ఆయన ఇమేజ్ కి డ్యామేజ్ అయ్యేలా ప్రవర్తించను. అందుచేత ఎక్స్ పోజింగ్ కి నేను దూరం అంటోంది.
ప్రేమ పెళ్లి ...
లక్ష్మి ప్రసన్న ... ప్రేమానంద్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కామన్ ఫ్రెండ్ ద్వారా ప్రేమానంద్ పరిచయం కావడం..ఆతర్వాత ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో పరిచయం కాస్త పరిణయానికి దారితీసింది. వీరిద్దరు ఒకరికి తెలియకుండా ఒకరు ఒకే కాలేజీలో చదువుకున్నారు. ప్రేమానంద్ తన ప్రేమ గురించి విష్ణుకు చెప్పడం ... విష్ణు ... మోహన్ బాబు గారికి చెప్పడం..నాలుగైదు సార్లు ప్రేమానందన్ తో మాట్లాడిన తర్వాత మోహన్ బాబు గారు ఫైనల్ గా ఓకె చెప్పారట. అలా లక్ష్మి ప్రసన్న ప్రేమ పెళ్లి జరిగింది.
అభిమాన హీరో, హీరోయిన్
చిన్నప్పటి నుంచి నాగార్జున అంటే చాలా ఇష్టం. హీరోయిన్ అంటే ప్రియాంకా చోప్రా.
డ్రీమ్ ..
తనకు తెలిసిన కళ ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించాలి. వారి కోసం ఏదైనా చేయాలి. మరిన్ని మంచి సినిమాలు చేయాలన్నదే లక్ష్మి ప్రసన్న డ్రీమ్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments