మరో తమిళ సినిమా లో.. మంచు లక్ష్మి

  • IndiaGlitz, [Wednesday,March 07 2018]

మంచు లక్ష్మి మరో తమిళ సినిమా చేయబోతోంది. మంచి కథలకే నా ఓటు అని ముందు నుంచీ చెబుతోన్న లక్ష్మి అందుకు తగ్గట్టే కంటెంట్ ఉన్న కథలనే సెలెక్ట్ చేసుకుంటోంది. ప్రస్తుతం 'వైఫ్ ఆఫ్ రామ్' అనే ఓ కొత్తతరహా కథతో రాబోతోన్న లక్ష్మికి మరో మంచి ఆఫర్ వచ్చింది. అది కూడా తమిళ్ లో. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన తుమ్హారీ సులు అనే చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్నారు.

బాలీవుడ్ లో విద్యాబాలన్ పోషించిన పాత్రను తమిళంలో జ్యోతిక చేస్తోంది.ఇదే సినిమాలో నేహాధూపియా క్యారెక్టర్ కు మంచు లక్ష్మిని అప్రోచ్ అయ్యారు. గతంలో ఒకట్రెండు తమిళ సినిమాలు చేసినా, ఈ పాత్ర తనకు ఖచ్చితంగా గుర్తింపు తెస్తుందనే వెంటనే ఈ ప్రాజెక్ట్ ఒప్పుకున్నానంటోంది లక్ష్మి. ఈ విషయాన్ని స్వయంగా పంచుకుని ఆనందాన్ని వ్యక్తం చేసింది.

ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ.. బాలీవుడ్ లో వచ్చిన తుమ్హారీ సులు నేను చూడలేదు. కానీ నేహా ధూపియా పాత్ర గురించి తెలుసు. ఆమె పాత్ర సినిమాలో చాలా స్టైలిష్ గా ఉంటుంది. అలా ఉండటానికి నాకూ ఏ ఇబ్బంది లేదు. ఇప్పటికే చాలా డీ గ్లామర్ పాత్రలు చేసి బోర్ కొట్టేసింది. అందుకే ఈ పాత్ర కోసం చాలా ఎగ్సైటింగ్ గా ఉన్నాను. ఎప్పుడెప్పుడు సెట్స్ లోకి వెళతానా అన్నంత ఆసక్తిగా ఉంది. అసలు ఈ ప్రాజెక్ట్ లో నన్ను అనుకున్నందుకు సూర్య, జ్యోతికలకు థాంక్స్.

నా గురించి తెలుసు, నేనెంత కమాండింగ్ గా ఉంటానో అనేది. ఒక రకంగా చెప్పాలంటే తుమ్హారీ సులు లో నేహాధూపియా పాత్రలా నా మైండ్ కమాండింగ్ గా ఉంటుంది. ఇవన్నీ తెలిసే నేనైతేనే ఈ పాత్రకు కరెక్ట్ అనుకున్నారట''అని చాలా ఎగ్సైటింగ్ గా చెప్పింది మంచు లక్ష్మి. ఈ చిత్రం మే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లబోతోంది.

ఇక ప్రస్తుతం వైఫ్ ఆఫ్ రామ్ అనే మరో డిఫరెంట్ మూవీలో నటిస్తోంది లక్ష్మి. నిజాన్ని అబద్ధంగా, అబద్ధాన్ని నిజంగా నమ్మే ఒక విచిత్రమైన పాత్రలో తను కనిపిస్తుంది.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోన్న వైఫ్ ఆఫ్ రామ్ త్వరలోనే విడుదల కు సిద్ధమవుతోంది..

More News

చిరంజీవి 'మగధీరుడు'కి 32 ఏళ్ళు

బంధాలు,బాంధవ్యాల విలువల్ని చెప్తూనే,అంతర్లీనంగా స్నేహం గొప్పతనాన్ని కూడా చాటి చెప్పిన చిత్రం 'మగధీరుడు'.

'ఎన్.జి.కె' టైటిల్ గురించి దర్శకుడు ఏమన్నారంటే..

తమిళ స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఓ సినిమా(సూర్య 36)తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

శర్వాకి చిరు సెంటిమెంట్ మరోసారి కలిసొచ్చేనా?

ఇప్పటి తెలుగు హీరోలకి 90వ దశకంలో వచ్చిన మెగాస్టార్ చిరంజీవి పాటలను రీమిక్స్ చేయడం పరిపాటైపోయింది.

'భరత్ అనే నేను' టీజర్ విడుదల

సూపర్ స్టార్ మహేష్ బాబు,సూపర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో శ్రీమతి డి.పార్వతి సమర్పణలో

మార్చి 8న 'అభిమన్యుడు' మొదటి పాట

మాస్‌ హీరో విశాల్‌ కథానాయకుడిగా పి.ఎస్‌.మిత్రన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'అభిమన్యుడు'. ఈ చిత్రం తెలుగు రైట్స్‌ను హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ అధినేత జి.హరి ఫ్యాన్సీ ఆఫర్‌తో దక్కించుకున్నారు.