ప్రెగ్నెన్సీని సీక్రెట్‌గా వుంచిన శ్రీయా..గర్వంగా వుందన్న మంచు లక్ష్మీ
Send us your feedback to audioarticles@vaarta.com
డేటింగ్, పెళ్లి వంటి వాటిని రహస్యంగా వుంచి చిత్ర సీమకు షాకిచ్చిన శ్రీయా.. తల్లయిన విషయాన్ని కూడా అలాగే దాచిపెట్టింది. మొదటి లాక్‌డౌన్ సమయంలో భర్తతో బార్సిలోనాలో వుండిపోయిన శ్రీయా అక్కడే బిడ్డను కనేసింది. తనకు ఆడపిల్ల పుట్టిందని.. పేరు రాధ అని శ్రీయ ఇటీవల సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రియ తల్లైన విషయం తెలిసి సినీ జనాలు, ఆమె అభిమానులు అంతా సంతోషించినప్పటికి.. జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయాన్ని ఇలా రహస్యంగా ఉంచడంపై కొందరు మాత్రం గుస్సా అయ్యారు. ఈ క్రమంలో మోహన్ బాబు కుమార్తె లక్ష్మి ప్రసన్న కూడా శ్రీయ ప్రెగ్నెన్సీపై స్పందించింది.
శ్రియ పోస్ట్‌కు ఆమె రీట్వీట్ చేస్తూ.. ఇది ఎప్పటికి గొప్ప శుభవార్త అంటూ విష్ చేసింది. ఆనందకరమైన మాతృత్వాన్ని అనుభవించాలని ఆకాంక్షించినట్లు లక్ష్మీ ట్వీట్ చేశారు. ఆడ బిడ్డకు జన్మనివ్వడం ఈ ప్రపంచంలోనే అతి గొప్ప విషయం. నీకు దేవుడు మరింత శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నా. అలాగే ఈ విషయాన్ని ప్రపంచానికి బహిర్గతం చేయడంలో నువ్వు తీసుకున్న గ్యాప్ విషయంలో నిన్ను చూసి గర్వపడుతున్నా. ఎందుకంటే ప్రెగ్నెన్సీ, పిల్లలు అనేది నీ వ్యక్తిగత విషయం’ అని మంచు లక్ష్మీ పేర్కొన్నారు. కాగా 2018లో రష్యన్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త ఆండ్రీ కోషీవ్‌ను శ్రియ.. సీక్రెట్‌గా పెళ్లాడి.. ఈ విషయాన్ని కూడా చాలా కాలం దాచిన సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments