మంచు లక్ష్మీ ప్రసన్న ప్రధాన పాత్రలో కొత్త చిత్రం 'లక్ష్మీ బాంబ్' ప్రారంభం

  • IndiaGlitz, [Friday,May 20 2016]

మంచు లక్ష్మీ ప్రసన్న ప్రధాన పాత్రలో గునపాటి సురేష్ రెడ్డి సమర్పణలో ఉద్బబ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ కొత్త చిత్రం లక్ష్మీ బాంబ్, ఫ్రమ్ శివకాశి ట్యాగ్ లైన్ శుక్రవారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. గోపాలకృష్ణ దర్శకత్వంలో వేళ్ల మౌనిక చంద్రశేఖర్, ఉమ లక్ష్మి నరసింహ నిర్మాతలుగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ముహుర్తపు సన్నివేశానికి మంచు విష్ణు క్లాప్ కొట్టగా, మంచు మనోజ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సందర్భంగా..

మంచు లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ ''ఒక నటిగా ఇప్పటి వరకు నేను చేసిన పాత్రలకు భిన్నంగా పవర్ ఫుల్ జడ్జ్ పాత్రలో కనిపించబోతున్నాను. కార్తికేయ గోపాలకృష్ణగారు కథ చెప్పగానే చాలా ఎగ్జయిట్ అయ్యాను. సినిమా ఎప్పుడు స్టార్టవుతుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. సింగిల్ షెడ్యూల్ లో సినిమాను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం'' అన్నారు.

దర్శకుడు కార్తీకేయ గోపాలకృష్ణ మాట్లాడుతూ 'మంచి కామెడి థ్రిల్లర్, కొత్త కాన్సెప్ట్. మంచు లక్ష్మీగారు జడ్జ్ పాత్రలో కనపడనున్నారు. చాలా పవర్ ఫుల్ రోల్. ఈ సినిమాకు లక్ష్మీ బాంబ్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశాం. వచ్చే నెల నుండి సినిమా రెగ్యులర్ చిత్రీకరణను జరుపుకోనుంది. సింగిల్ షెడ్యూల్ లో సినిమాను కంప్లీట్ చేస్తాం. సునీల్ కశ్యప్ ఈ సినిమాకు సంగీతానందిస్తున్నారు'' అన్నారు.

డార్లింగ్ స్వామి మాట్లాడుతూ 'దీపావళి టపాసుల్లో లక్ష్మీ బాంబ్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో ఈ సినిమాలో లక్ష్మీ గారి పాత్ర అలా ఉంటుంది. సినిమా తప్పకుండా పెద్ద విజయాన్ని సాధిస్తుంది'' అన్నారు.

సునీల్ కశ్యప్ మాట్లాడుతూ 'సినిమాలో సంగీతం చేసే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు థాంక్స్'' అన్నారు.

ఈ చిత్రానికి కథ-మాటలు: డార్లింగ్ స్వామి, ఆర్ట్: రఘుకులకర్ణి, డ్యాన్స్: రఘు, సంగీతం: సునీల్ కశ్యప్, ఫోటోగ్రఫీ: అంజి, నిర్మాతలు: వేళ్ల మౌనిక చంద్రశేఖర్, ఉమ లక్ష్మి నరసింహ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కార్తికేయ గోపాలకృష్ణ

More News

ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీపై క్లారిటీ వ‌చ్చేసింది..!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం జ‌న‌తా గ్యారేజ్ చిత్రంలో న‌టిస్తున్నారు. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు మూడో సిరీస్ ముగింపు..

ఎక్క‌డో మారుమూల ప‌ల్లెటూరిలో ఉన్న ఒక సామాన్యుడు కూడా త‌న క‌ల‌ల్నీ ఆశ‌ల్నీ నిజం చేసుకునే అద్భుత అవ‌కాశం క‌ల్పించిన  మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు మూడో సిరీస్ ఈనెల‌ 22న (ఆదివారం  ఎపిసోడ్ తో) ముగుస్తోంది.

హ్యాపీ బర్త్ డే టు రాకింగ్ స్టార్ మంచు మనోజ్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో డిఫరెంట్ స్టైల్ లో నటనకు సరికొత్త నిర్వచనం చెప్పిన కలెక్షన్ కింగ్ డా.మంచు మోహన్ బాబు తనయుడైన మంచు మనోజ్ మేజర్ చంద్రకాంత్, అడవిలో అన్న వంటి పలు చిత్రాల్లో బాలనటుడిగా మెప్పించారు.

సూర్య త‌దుప‌రి చిత్రం ద‌ర్శ‌కుడు ఇత‌డే..

సూర్య ప్ర‌స్తుతం సింగం, సింగం 2 చిత్రాల సీక్వెల్ సింగం 3 లో న‌టిస్తున్నారు.  సూర్య స‌ర‌స‌న అనుష్క‌, శృతిహాస‌న్ న‌టిస్తున్న ఈ చిత్రాన్ని హ‌రి తెర‌కెక్కిస్తున్నారు.

జ‌న‌తా గ్యారేజ్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్..

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం జ‌న‌తా గ్యారేజ్. ఈ చిత్రంలో ఎన్టీఆర్ స‌ర‌స‌న స‌మంత‌, నిత్యామీన‌న్ న‌టిస్తున్నారు.