మంచు లక్ష్మీ ప్రసన్న ప్రధాన పాత్రలో కొత్త చిత్రం 'లక్ష్మీ బాంబ్' ప్రారంభం
Send us your feedback to audioarticles@vaarta.com
మంచు లక్ష్మీ ప్రసన్న ప్రధాన పాత్రలో గునపాటి సురేష్ రెడ్డి సమర్పణలో ఉద్బబ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ కొత్త చిత్రం లక్ష్మీ బాంబ్, ఫ్రమ్ శివకాశి ట్యాగ్ లైన్ శుక్రవారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. గోపాలకృష్ణ దర్శకత్వంలో వేళ్ల మౌనిక చంద్రశేఖర్, ఉమ లక్ష్మి నరసింహ నిర్మాతలుగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ముహుర్తపు సన్నివేశానికి మంచు విష్ణు క్లాప్ కొట్టగా, మంచు మనోజ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సందర్భంగా..
మంచు లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ ``ఒక నటిగా ఇప్పటి వరకు నేను చేసిన పాత్రలకు భిన్నంగా పవర్ ఫుల్ జడ్జ్ పాత్రలో కనిపించబోతున్నాను. కార్తికేయ గోపాలకృష్ణగారు కథ చెప్పగానే చాలా ఎగ్జయిట్ అయ్యాను. సినిమా ఎప్పుడు స్టార్టవుతుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. సింగిల్ షెడ్యూల్ లో సినిమాను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం`` అన్నారు.
దర్శకుడు కార్తీకేయ గోపాలకృష్ణ మాట్లాడుతూ `మంచి కామెడి థ్రిల్లర్, కొత్త కాన్సెప్ట్. మంచు లక్ష్మీగారు జడ్జ్ పాత్రలో కనపడనున్నారు. చాలా పవర్ ఫుల్ రోల్. ఈ సినిమాకు లక్ష్మీ బాంబ్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశాం. వచ్చే నెల నుండి సినిమా రెగ్యులర్ చిత్రీకరణను జరుపుకోనుంది. సింగిల్ షెడ్యూల్ లో సినిమాను కంప్లీట్ చేస్తాం. సునీల్ కశ్యప్ ఈ సినిమాకు సంగీతానందిస్తున్నారు`` అన్నారు.
డార్లింగ్ స్వామి మాట్లాడుతూ `దీపావళి టపాసుల్లో లక్ష్మీ బాంబ్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో ఈ సినిమాలో లక్ష్మీ గారి పాత్ర అలా ఉంటుంది. సినిమా తప్పకుండా పెద్ద విజయాన్ని సాధిస్తుంది`` అన్నారు.
సునీల్ కశ్యప్ మాట్లాడుతూ `సినిమాలో సంగీతం చేసే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు థాంక్స్`` అన్నారు.
ఈ చిత్రానికి కథ-మాటలు: డార్లింగ్ స్వామి, ఆర్ట్: రఘుకులకర్ణి, డ్యాన్స్: రఘు, సంగీతం: సునీల్ కశ్యప్, ఫోటోగ్రఫీ: అంజి, నిర్మాతలు: వేళ్ల మౌనిక చంద్రశేఖర్, ఉమ లక్ష్మి నరసింహ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కార్తికేయ గోపాలకృష్ణ
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com