'ధృవ' కు మంచు హీరో కాంప్లిమెంట్.....
- IndiaGlitz, [Wednesday,December 07 2016]
ప్రస్తుతం టాలీవుడ్‌లో రాంచరణ్ ధృవ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. తమిళ చిత్రం తని ఒరువన్‌కు ఈ చిత్రం రీమేక్ అయినప్పటికీ సురేందర్‌రెడ్డి టేకింగ్, రాంచరణ్ డేడికేషన్, హార్డ్ వర్క్‌తో సినిమా కొత్త రూపు సంతరించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 9న గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో చరణ్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనపడుతున్నాడు.
క్యారెక్టర్‌లో మరింత పదును తేవడానికి చరణ్ సల్మాన్‌ఖాన్ ట్రయినర్ ట్రైనింగ్‌లో సిక్స్ ప్యాక్ చేశాడు. ఇప్పుడు చరణ్ సిక్స్‌ప్యాక్ గురించిన వార్తలు అభిమానుల్లోనే కాదు, ఇండస్ట్రీ వర్గాల్లో కూడా హల్ చల్ చేస్తుంది. అందుకు నిదర్శనమే చరణ్ లుక్‌పై మంచు హీరో మంచు విష్ణు కితాబివ్వడం. చరణ్ లుక్ చాలా సెక్సీగా ఉంది. దీన్ని సెక్సీ అనకపోతే మరి దేన్ని సెక్సీ అనలేం. హార్డ్ వర్క్, డేడికేషన్‌తోనే ఇది సాధ్యం, ఆల్ ది బెస్ట్ టు ధృవ అని ట్విట్టర్ అకౌంట్ ద్వారా చరణ్ అండ్ ధృవ టీంకు విషెష్ చెప్పాడు.