మంచు ఫ్యామిలీ సేనాపతి
Send us your feedback to audioarticles@vaarta.com
నటుడుగా ఎన్నో విలక్షణమైన పాత్రల్లో నటించిన మంచు మోహన్ బాబు, విష్ణు కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందనుంది. మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో పొలిటికల్ టచ్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.
మోహన్‌బాబు కీలకపాత్రలో నటిస్తాడని, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లో రూపొందనున్న ఈ చిత్రానికి `సేనాపతి` అనే టైటిల్‌ను కూడా అనుకుంటున్నారట. `ఈడోరకం-ఆడోరకం` తర్వాత మంచు విష్ణు ఈ సినిమాను చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడట. అన్నీ అనుకున్నట్టు కుదిరితే రౌడీ చిత్రం తర్వాత మోహన్‌బాబు, విష్ణు కలయికలో ఈ చిత్రం రానుందన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com