మంచు సోదరులిద్దరికీ కీలకమే
Send us your feedback to audioarticles@vaarta.com
మోహన్‌బాబు నటవారసులుగా పరిచయమైనా.. తమకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలన్న ప్రయత్నం చేస్తున్నారు మంచు సోదరులు విష్ణు, మనోజ్. ఈ ప్రయత్నంలో భాగంగా ఆడపాదడపా వీరి చెంతకు విజయాలొచ్చినా.. స్టార్హీరోలన్నంత స్థాయి హిట్ లైతే వారిని వరించలేదు. ఈ నేపథ్యంలో వారిద్దరి తాజా ప్రయత్నాలైనా వారికి ఆ లోటుని తీరుస్తాయేమో చూడాలి.
విశేషమేమింటే.. మంచు సోదరులిద్దరీ కొత్త సినిమాలు ఒకే నెలలో రెండు వారాల గ్యాప్‌లో ప్రేక్షకుల ముందుకు రావడం. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో మంచు మనోజ్ నటించిన 'ఎటాక్' ఏప్రిల్ 1న విడుదల కానుంటే.. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో మంచు విష్ణు నటించిన 'ఈడో రకం.. ఆడో రకం' ఏప్రిల్ 14న రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. వారాల గ్యాప్‌లో వస్తున్న ఈ సినిమాలపై ఈ ఇద్దరు అన్నదమ్ములు భారీ ఆశలనే పెట్టుకున్నారు. వారి ఆశలు ఫలించాలని కోరుకుందాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com