మన ఊరి రామాయణం సస్పెన్స్ టీజర్ రిలీజ్..!
Wednesday, September 7, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
జాతీయ ఉత్తమనటుడు ప్రకాష్ రాజ్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ రూపొందించిన ద్విభాషా చిత్రం మన ఊరి రామాయణం. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, ప్రియమణి, సత్యదేవ్, పృథ్వి, రఘుబాబు ప్రధాన పాత్రలు పోషించారు.ఈ చిత్రాన్ని కన్నడలో ఇదొల్లె రామాయణ అనే టైటిల్ తో రిలీజ్ చేయనున్నారు. దసరా కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 7న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మన ఊరి రామాయణం టీజర్ రిలీజ్ చేసారు.
సమాజంలో ఎంతో గౌరవించబడే ఆ వ్యక్తి జీవితంలో శ్రీరామనవమి సమయంలో లో జరిగినటువంటి ఒక సంఘటన తన జీవితాన్ని ఏ విధంగా మలుపు తిప్పింది అనేది ప్రధానంశంగా ఈ చిత్రం తెరకెక్కింది. ప్రతి మనిషిలో ఒక రాముడు ఒక రావణుడు వుంటాడు అని తెలియచెప్పే చిత్రం ఇది. టీజర్ చూస్తుంటే...సస్పెన్స్ తో ఉండేలా ఈ చిత్రాన్ని రూపొందించినట్టు తెలుస్తుంది. శ్రీరామనవమి రోజు ఏం జరిగింది. ఆ వ్యక్తి జీవితాన్ని ఎలా మలుపు తిప్పింది అనేది తెలియాలంటే మన ఊరి రామాయణం చూడాల్సిందే. మరి...ప్రకాష్ రాజ్ అభిరుచికి తగ్గట్టుగా వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన మన ఊరి రామాయణం అందర్నీ ఆకట్టుకుంటుందో లేదో చూడాలి..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments