పాటల చిత్రీకరణలో 'మనసే మాయ'
Send us your feedback to audioarticles@vaarta.com
తుల్జా భవాని ఫిలింస్, సొహ్సాబ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సంయుక్త పతాకాలపై ఎం.భాగ్యలక్ష్మి, కె.ఫిష్‌లక్ష్మి సహనిర్మాతలుగా సునీల్‌సాగర్ నిర్మాతగా సాయికిరణ్, ప్రాచి అధికారి హీరో హీరోయిన్స్‌గా ఎం.బల్వాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హర్రర్ అండ్ ప్రేమకథా చిత్రం 'మనసే మాయ'. ఈ చిత్రం టాకీ పార్ట్‌ని పూర్తి చేసుకుంది. ఇటీవల హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మూడు పాటలను చిత్రీకరణ జరుపుకుని నవంబర్ 13 నుండి వైజాగ్, అరకు ప్రాంతాల్లో మిగిలిన నాలుగు పాటలను చిత్రీకరణ జరుపుకోనున్నది.
ఈ సందర్భంగా దర్శకుడు ఎం.బల్వాన్ మాట్లాడుతూ... ''ఈ చిత్రంలో 7 పాటలు వున్నాయి. నూతన సంగీత దర్శకుడు ఎస్.కె.మజ్నును ఈ చిత్రం ద్వారా పరిచయం చేస్తున్నాము. లవ్ అండ్ ఎంటర్‌టైనర్‌తో పాటు హర్రర్‌ని మిక్స్ చేస్తున్న ఈ చిత్రం ద్వారా మంచి గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నాను'' అన్నారు.
నిర్మాత సునీల్‌సాగర్ మాట్లాడుతూ... ''నూతన దర్శకుడే అయినా ఈ చిత్రాన్ని అందరినీ ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దుతున్నాడు. ఈ చిత్రం నవంబర్ నెలాఖరు వరకు షూటింగ్ పూర్తి చేసుకుని డిసెంబర్‌లో పోస్ట్ ప్రొడక్షన్స్‌తో పాటు ఆడియో విడుదల కార్యక్రమాలు జరుపుకుని జనవరి నెల మొదటివారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము'' అన్నారు.
సంగీత దర్శకుడు ఎస్.కె.మజ్ను మాట్లాడుతూ... ''ఈ చిత్రంలో వున్న 7 పాటలు సందర్భోచితంగా అందరికీ నచ్చేలా వుంటాయి. దర్శకుడు అద్భుతంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రీరికార్డింగ్‌కు మంచి స్కోప్ వుంటూనే నాకు మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను'' అన్నారు.
ఈ చిత్రంలో సాయికిరణ్, ప్రాచి అధికారి, రఫి, ఫిరోజ్, జీవా, కోట శంకరరావు, దిల్ రమేష్, శివ సత్యనారాయణ, కవిత, పద్మాజయంతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ప్రసాద్, ఎడిటింగ్: శ్రీనివాస్, డ్యాన్స్: బ్రదర్ ఆనంద్, స్టిల్స్: శ్రీను, పబ్లిసిటీ: ధీరజ్, సంగీతం: ఎస్.కె.మజ్ను, సహనిర్మాతలు: ఎం.భాగ్యలక్ష్మి, కె.ఫిష్‌లక్ష్మి, నిర్మాత: సునీల్‌సాగర్, కథ-మాటలు-పాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: ఎం.బల్వాన్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments