అందరి మనసుల్లో 'మనసైనోడు'
- IndiaGlitz, [Wednesday,April 05 2017]
నూతనం.. నిత్య నూతనం .. ఈ సినీ పరిశ్రమలోకి ఏoతో మంది నూతనంగా ప్రవేశించి... నిరంతరం ఈ సినీ పరిశ్రమని నిత్య నూతనంగా మారుస్తూ.. సకల జనులను నిత్యo రంజింప చేస్తున్న నటీనటులు, సాoకేతిక నిపుణుల నిండి వస్తున్న చిత్రం 'మనసైనోడు'. H-PICTURES వారి 'మనసైనోడు' చిత్రం అందరి మనసుల్లో 'మనసైనోడు' అయ్యే విధంగా ప్రొడ్యూసర్ హసీబుద్దిన్ నిర్మిస్తున్నారు.
మనోజ్ నందన్, ప్రియసింగ్ హీరో హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం 80% టాకీ పూర్తి చేసుకుoది. చివర షెడ్యూల్ లో బాగంగా నానకరామగూడా రామానాయుడు స్టూడియో లో పోసాని కృష్ణ మురళీ మరియు హీరో హీరొయిన్ ల మీద చిత్రీకరణ జరుగుతుంది. కొత్త కధ, కధనంతో తెరకెక్కుతున్న 'మనసైనోడు' చిత్రం ద్వారా హీరొయిన్ ప్రియసింగ్ మరియు పలు చిత్రాలకు దర్శకత్వ శాఖ పనిచేసిన సత్యవరపు వెంకటేశ్వరరావుని దర్శకుడుగా పరిచయం చేస్తున్నామని నిర్మాత తెలిపారు.
'జయ జయ జయహే భారతావని సద్గుణ సముపేత' అంటూ మన భారతదేశ గొప్పతనాన్ని ప్రతి భారతీయుడు గర్వంగా తల ఎత్తుకుని పాడుకునే విధంగా ఒక గొప్ప దేశభక్తీ గీతాన్ని Dr. C నారాయణ రెడ్డి గారు రచిoచారు. మగవాళ్ళ జీవితాల్లో ఆడవాళ్ళ లేకపోతే ఎంత నష్టమో కాస్త చిలిపిగా ఒక పాటను భాస్కరబట్ల రచిoచారు. ఈ చిత్రంలో ఆరు పాటలు ప్రముఖ రచయతలు రాయడం విశేషo. ప్రేమ కధలో కుటుంబ కధని జోడించి దేశానికి మంచి మెసేజ్ ఇచ్చే విధంగా దేశభక్తిని యువకుల్లో నింపే విధంగా రూపుదిద్దుతున్న H-PICTURES వారి చిత్రం 'మనసైనోడు' అని నిర్మాత హసీబుద్దిన్ తెలిపారు.
నటీనటులు : మనోజ్ నందన్, ప్రియసింగ్, పోసాని కృష్ణమురళీ, రఘుబాబు, గిరిబాబు, కేదార్ శంకర్, గుర్రాజు, వేణుగోపాల్, అనంత్, చేతన్య, శశాంక, ఫణి, పవన్, గణపతి, వాసు, రవిశంకర్, రాజు మరియు సంగీత, మధుమని, జ్యోతి, దివ్యశ్రీగౌడ తదితరులు నటీస్తున్నారు. సాoకేతిక వర్గం : కో-డైరెక్టర్ : గోలి వెంకటేశ్వరరావు, డైరెక్టర్ అఫ్ ఫోటోగ్రఫీ: సురేంద్రరెడ్డి, ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్, ఆర్ట్ డైరెక్టర్: సత్య శ్రీనివాస్, మ్యూజిక్ డైరెక్టర్: సుభాష్ ఆనoద్, పాటలు: Dr. C నారాయణ రెడ్డి, భాస్కరబట్ల, గోసాల రాంబాబు, పూర్ణచారి, రచన సహకారం: సీతారామరాజు, P.R.O: సత్యనారాయణ, స్టిల్స్: రామిరెడ్డి, ప్రొడక్షన్ మేనేజర్స్: రవిశంకర్, పయ్యావుల శ్రీనివాస్, డాన్స్ మాస్టర్స్ : గణేష్, మాస్టర్, శామ్యూల్, అనీష్ కిరణ్, మేకప్: సూర్యచంద్ర, కాస్ట్యూమ్స్: నాగేశ్వరరావు, ప్రొడక్షన్: శ్రీనివాస్, నిర్మాత: హసీబుద్దిన్, కధ, మాటలు, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం : సత్యవరపు వెంకటేశ్వరరావు.