మ‌నమంతా టీజ‌ర్ రివ్యూ

  • IndiaGlitz, [Saturday,June 25 2016]

మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్, గౌత‌మి, కేరింత ఫేం విశ్వంత్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం మ‌నమంతా. ఈ చిత్రాన్ని వారాహి చ‌ల‌న‌చిత్ర బ్యాన‌ర్ పై సాయి కొర్ర‌పాటి నిర్మిస్తున్నారు. తెలుగు, త‌మిళ్, మళయాల భాషల్లో రూపొందుతున్న ఈ విభిన్న క‌థా చిత్రం మ‌న‌మంతా టీజ‌ర్ ను ఈరోజు ఉద‌యం రిలీజ్ చేసారు.

ఐతే, అనుకోకుండా ఒక రోజు, సాహ‌సం...ఇలా డిఫ‌రెంట్ స్టోరీస్ తెర‌కెక్కించే చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ఈసారి బ‌డికి వెళ్లే బాలిక, ఇంజ‌నీరింగ్ చ‌దివే టీనేజ్ కుర్రాడు, గాయ‌త్రి అనే హౌస్ వైఫ్, ఓ సూప‌ర్ మార్కెట్ కు అసిస్టెంట్ మేనేజ‌ర్... ఈ నలుగురి జీవితాలు అనుకోకుండా ఒక చోట కలవడం, దాంతో అందరి జీవితాలూ అనుకోని మలుపులు తిర‌గడం అనే వినూత్న కాన్సెప్ట్‌తో మ‌న‌మంతా చిత్రాన్ని తెర‌కెక్కించారు.

ఇక టీజ‌ర్ లో...మ‌హిత అనే స్కూల్ గాళ్ హ్యాపీగా ఉండాల‌నుకుంటుంది. అభిరామ్ అనే ఇంజ‌నీరింగ్ స్టూడెండ్ త‌న‌కు ఇష్ట‌మైన వాళ్ల కోసం ఇష్ట‌మైన వ‌స్తువు అమ్మేస్తాడు. గాయత్రి అనే హౌస్ వైఫ్ జ్యూయ‌ల‌రీ షాపుకి వెళ్లిన‌ప్పుడు ఎంతో గౌర‌వం ఇచ్చారు నాకు ఆ రెస్పెక్ట్ కావాలి అంటుంది. శ్రీరామ్ అనే అసిస్టెంట్ మేనేజ‌ర్ బ్ర‌త‌క‌డం నేర్చుకుంటున్నాను అనుకున్నాను కానీ మ‌నిషిగా బ‌త‌క‌డం మ‌ర‌చిపోయాను అంటాడు. 1 వ‌ర‌ల్డ్ 4 స్టోరీస్.. టీజ‌ర్ చాలా డిఫ‌రెంట్ గా ఉంది.

టీజ‌ర్ చూస్తుంటే ఇది రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమా కాదు...డిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన చిత్రం అని తెలుస్తుంది. అలాగే మ‌న‌మంత మ‌నం అంద‌రం చూడాల్సిన సినిమా అనిపిస్తుంది. ద‌ర్శ‌క‌ధీర రాజ‌మౌళి సైతం టీజ‌ర్ చూసిన త‌ర్వాత ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామా అని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాను. సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయండి అంటూ ట్విట్ట‌ర్ లో త‌న స్పంద‌న తెలియ‌చేసారు. ఈ చిత్రం కోసం మోహ‌న్ లాల్ ఫ‌స్ట్ టైమ్ తెలుగు నేర్చుకుని డ‌బ్బింగ్ చెప్ప‌డం ఓ విశేషమైతే... సీనియ‌ర్ న‌టి గౌత‌మి దాదాపు రెండు ద‌శాబ్దాల త‌ర్వాత న‌టించ‌డం మ‌రో విశేషం. మ‌న‌మంతా మ‌నంద‌రి మ‌న‌సులు దోచుకుంటుంద‌ని ఆశిద్దాం.

More News

మాటీవీలో ఈరోజు రేపు సినిమా అవార్డ్స్..

చిరు చిందేస్తే..? మెగాస్టార్ రియ‌ల్ గా సూప‌ర్ హిట్ సాంగ్ కి గ్రేసీ మూమెంట్స్ ఇస్తే..? అని ర‌క‌ర‌కాల శీర్షిక‌ల‌తో సోష‌ల్ మీడియా, ప్రింట్ మీడియాలో మారుమోగిపోయిన టాపిక్ సినిమా అవార్డ్స్ వేదిక పైన చిరంజీవి డ్యాన్స్.

భానుశంక‌ర్ అర్ధ‌నారి ట్రైల‌ర్ రిలీజ్

నూత‌న న‌టీన‌టులు అర్జున్ య‌జ‌త్, మౌర్యాని ప్ర‌ధాన తారాగ‌ణంగా భానుశంక‌ర్ చౌద‌రి తెర‌కెక్కించిన చిత్రం అర్ధ‌నారి. ఈ చిత్రాన్ని ప‌త్తికొండ సినిమాస్ బ్యాన‌ర్ పై ర‌వికుమార్.ఎమ్ నిర్మించారు. భ‌ర‌త్ రాజ్ స‌మ‌ర్ప‌ణ‌లో రూపొందిన అర్ధనారి చిత్రం ట్రైల‌ర్ రిలీజ్ కార్య‌క్ర‌మం ప్ర‌సాద్ ల్యాబ్స్ లో జ‌రిగింది.

ఉత్త‌రాది హీరోయిన్‌తో లారెన్స్‌

మాధ‌వ‌న్ ‘ఇరుదు సుట్రు’ చిత్రంలో న‌టించిన రితిక సింగ్ ప్ర‌స్తుతం త‌మిళంలో విజ‌య్ సేతుప‌తి స‌ర‌స‌న ‘ఆండ‌వ‌న్ క‌ట్ట‌లై’ చిత్రంలో న‌టిస్తుంది. ఇది కాకుండా తెలుగులో కూడా ‘ఇరుదు సుట్రు’ రీమేక్ కానుంది.

ప్ర‌జెంట్ అమ్మాయిలు ఎలా ఉన్నారో చూపిస్తున్నాం అంతేకానీ...అమ్మాయిల‌ను త‌ప్పుగా చూపిండం లేదు - దిల్ రాజు

ఆర్య‌, బొమ్మ‌రిల్లు, ప‌రుగు, సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లెచెట్టు, మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ట్...ఇలా ఫ్యామిలీ అంతా క‌లిసి చూసేలా చిత్రాల‌ను నిర్మిస్తూ అభిరుచిగి గ‌ల నిర్మాత‌గా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు ఏర్ప‌రుచుకున్న నిర్మాత దిల్ రాజు.

'ఒక మ‌న‌సు' క‌టింగ్ అయింది

నాగ‌శౌర్య‌, నిహారిక జంట‌గా మ‌ధుర ఎంట‌ర్ టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై రామ‌రాజు దర్శ‌క‌త్వంలో వచ్చిన సినిమా ‘ఒక మ‌న‌సు’.