మనమంతా టీజర్ రివ్యూ
Send us your feedback to audioarticles@vaarta.com
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, గౌతమి, కేరింత ఫేం విశ్వంత్ ప్రధాన పాత్రల్లో చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం మనమంతా. ఈ చిత్రాన్ని వారాహి చలనచిత్ర బ్యానర్ పై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ్, మళయాల భాషల్లో రూపొందుతున్న ఈ విభిన్న కథా చిత్రం మనమంతా టీజర్ ను ఈరోజు ఉదయం రిలీజ్ చేసారు.
ఐతే, అనుకోకుండా ఒక రోజు, సాహసం...ఇలా డిఫరెంట్ స్టోరీస్ తెరకెక్కించే చంద్రశేఖర్ ఏలేటి ఈసారి బడికి వెళ్లే బాలిక, ఇంజనీరింగ్ చదివే టీనేజ్ కుర్రాడు, గాయత్రి అనే హౌస్ వైఫ్, ఓ సూపర్ మార్కెట్ కు అసిస్టెంట్ మేనేజర్... ఈ నలుగురి జీవితాలు అనుకోకుండా ఒక చోట కలవడం, దాంతో అందరి జీవితాలూ అనుకోని మలుపులు తిరగడం అనే వినూత్న కాన్సెప్ట్‌తో మనమంతా చిత్రాన్ని తెరకెక్కించారు.
ఇక టీజర్ లో...మహిత అనే స్కూల్ గాళ్ హ్యాపీగా ఉండాలనుకుంటుంది. అభిరామ్ అనే ఇంజనీరింగ్ స్టూడెండ్ తనకు ఇష్టమైన వాళ్ల కోసం ఇష్టమైన వస్తువు అమ్మేస్తాడు. గాయత్రి అనే హౌస్ వైఫ్ జ్యూయలరీ షాపుకి వెళ్లినప్పుడు ఎంతో గౌరవం ఇచ్చారు నాకు ఆ రెస్పెక్ట్ కావాలి అంటుంది. శ్రీరామ్ అనే అసిస్టెంట్ మేనేజర్ బ్రతకడం నేర్చుకుంటున్నాను అనుకున్నాను కానీ మనిషిగా బతకడం మరచిపోయాను అంటాడు. 1 వరల్డ్ 4 స్టోరీస్.. టీజర్ చాలా డిఫరెంట్ గా ఉంది.
టీజర్ చూస్తుంటే ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు...డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన చిత్రం అని తెలుస్తుంది. అలాగే మనమంత మనం అందరం చూడాల్సిన సినిమా అనిపిస్తుంది. దర్శకధీర రాజమౌళి సైతం టీజర్ చూసిన తర్వాత ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయండి అంటూ ట్విట్టర్ లో తన స్పందన తెలియచేసారు. ఈ చిత్రం కోసం మోహన్ లాల్ ఫస్ట్ టైమ్ తెలుగు నేర్చుకుని డబ్బింగ్ చెప్పడం ఓ విశేషమైతే... సీనియర్ నటి గౌతమి దాదాపు రెండు దశాబ్దాల తర్వాత నటించడం మరో విశేషం. మనమంతా మనందరి మనసులు దోచుకుంటుందని ఆశిద్దాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments