భారీ రేటుకు 'మ‌నమంతా' శాటిలైట్ హ‌క్కులు

  • IndiaGlitz, [Thursday,August 11 2016]

మోహ‌న్ లాల్‌, గౌత‌మి కీల‌క పాత్ర‌ల్లో విశ్వాంత్‌, రైనారావులు తారాగ‌ణంగా విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు చంద్ర‌శేఖ‌ర్ యేలేటి ద‌ర్శ‌క‌త్వంలో వారాహి చ‌ల‌న చిత్రం బ్యాన‌ర్‌పై సాయికొర్ర‌పాటి నిర్మించిన చిత్రం మ‌నమంతా. ఇటు ప్రేక్ష‌కులే కాదు, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న చిత్రంగా నిలిచింది.

మాన‌వ సంబంధాల‌ను, ఎమోష‌న్స్ ను క‌ల‌గ‌లిపి చంద్ర‌శేఖ‌ర్ రాసుక‌న్న క‌థ‌కు మోహ‌న్‌లాల్‌, గౌత‌మి వంటి న‌టీన‌టులు ప్రాణం పోశారు. కాగా ఈ సినిమా శాటైలైట్ హ‌క్కుల‌ను మా టీవీవారు 6.80 కోట్ల రూపాయ‌ల‌కు కోనుగోలు చేశార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఇంత భారీ రేటులో శాటిలైట్ హ‌క్కులు రావ‌డం అనేది సాధార‌ణ విష‌యం కాద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి.