మనమంతా గురించి రాజమౌళి రివ్యూ..
Send us your feedback to audioarticles@vaarta.com
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, గౌతమి, కేరింత ఫేం విశ్వంత్ ప్రధాన పాత్రల్లో చంద్రశేఖర్ ఏలేటి రూపొందించిన చిత్ర మనమంతా. ఈ చిత్రాన్ని వారాహి చలనచిత్ర బ్యానర్ పై సాయి కొర్రపాటి నిర్మించారు. విభిన్న కథాంశంతో రూపొందించిన మనమంతా చిత్రం ఈరోజు రిలీజ్ అయ్యింది. అయితే...తనకు సినిమా నచ్చితే అది ఎవరి సినిమా..? పెద్ద సినిమానా.. చిన్న సినిమానా..? అని ఆలోచించకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పే దర్శకధీర రాజమౌళి మనమంతా చిత్రాన్నిఈరోజు ఐమ్యాక్స్ లో చూసారు. అంతే కాకుండా మనమంతా గురించి తన స్పందనను కూడా ట్విట్టర్ ద్వారా తెలియచేసారు.
ఇంతకీ మనమంతా గురించి రాజమౌళి రివ్యూ ఏమిటంటే...మనమంతా సినిమా డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి, వారాహి చలనచిత్ర సంస్థ కెరీర్ లో క్లాసిక్ గా నిలుస్తుంది. సీనియర్ ఏక్టర్ మోహన్ లాల్ నుంచి చిన్నపాప క్యారెక్టర్ వరకు అందరి నుంచి మంచి నటను రాబట్టారు చందు. వాళ్ల నటనతో మనల్ని నవ్విస్తారు..ఏడిపిస్తారు ఆఖరికి మన హృదయాల్లో చిరకాలం నిలిచిపోతారు. ఫిల్మ్ స్టూడెంట్స్ కి ఒక టెస్ట్ బుక్ లాంటి సినిమా ఇది. ఈ సినిమాకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరు మనమంతా చిత్రానికి వర్క్ చేసాను అని గర్వంగా చెప్పుకోవచ్చు అంటూ మనమంతా పై రివ్యూ రాసేసారు జక్కన్న.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com