ముందుకొచ్చిన 'మనమంతా'
Send us your feedback to audioarticles@vaarta.com
జాతీయస్థాయి ఉత్తమనటుడు మోహన్ లాల్. విలక్షణ నటి గౌతమి ప్రధానపాత్రల్లో వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం మనమంతా`. చంద్రశేఖర్ యేలేటి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి ప్రొడక్షన్ సాయిశివాని సమర్పణలో వారాహి చలన చిత్రం బ్యానర్ పై రజనీ కొర్రపాటి నిర్మాతగా ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
మధ్య తరగతికి చెందిన ఓ వ్యక్తి, అలాగే మధ్యతరగతికి చెందిన ఈ స్త్రీ, ఇంజనీరింగ్ కుర్రాడు, పదమూడేళ్ల అమ్మాయి ఇలా నలుగురు వేర్వేరు వ్యక్తల జీవితాలకు సంబంధించిన కథతో చంద్రశేఖర్ యేలేటి చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ నలుగురి కథ ఎలాంటి మలుపులు తీసుకుందనే ఈ కథాంశం చాలా ఆసక్తికరంగా సాగే చిత్రమిది. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ ఫైనల్ స్టేజ్ కు చేరుకుంది. త్వరలోనే చిత్రీకరణ ముగించుకని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను ఆగస్ట్ 12న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే అదే రోజున తిక్క, బాబు బంగారం వంటి సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతుండటంతో ఒకరోజు వారం ముందుగా అంటే ఆగస్టు 5న సినిమాను రిలీజ్ చేస్తున్నారు నిర్మాతలు. అధికారక ప్రకటన రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com