ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తున్న మన ఊరి రామాయణం ట్రైలర్..!
Send us your feedback to audioarticles@vaarta.com
జాతీయ ఉత్తమ నటుడు ప్రకాష్ రాజ్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం మన ఊరి రామాయణం. తెలుగు, కన్నడలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, ప్రియమణి, సత్యదేవ్, పృథ్వీ, రఘుబాబు ప్రధాన పాత్రలు పోషించారు. ఇటీవల టీజర్స్ రిలీజ్ చేసిన ప్రకాష్ రాజ్ ఆడియో రిలీజ్ లో ట్రైలర్ రిలీజ్ చేసారు.
ఇందులో అనుకోకుండా ప్రియమణితో ప్రకాష్ రాజ్ ఓ ఇంట్లో ఇరుక్కుపోతారు. తన ఇంటికి కూడా వెళ్లలేని పరిస్థితి. తన కుటుంబంతో పాటు ఊరంతా ప్రకాష్ రాజ్ ఏమైపోయాడో అనుకుంటుంటారు. ఈ సంఘటన నుంచి ఎలా బయటపడ్డారు..? ఆతర్వాత ఏం జరిగింది అనేది మెయిన్ కాన్సెప్ట్ అని తెలుస్తుంది. ప్రతి మనిషిలో రాముడు, రావణుడు ఉంటాడనే విభిన్న కథాంశంతో ఈ చిత్రాన్ని ప్రకాష్ రాజ్ తెరకెక్కించారు. టీజర్ & ట్రైలర్ మన ఊరి రామాయణం పై ఇంట్రస్ట్ పెంచేస్తున్నాయి. మరి...దసరా కానుకగా అక్టోబర్ 7న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మన ఊరి రామాయణం ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com