'మన అక్కినేని' అద్భుతమైన పుస్తకం - వెంకయ్య నాయుడు

  • IndiaGlitz, [Thursday,October 05 2017]

తెలుగువారు మరచిపోలేని, మరచిపోకూడని, మరచిపోని గొప్ప నటుడు అక్కినేని నాగేశ్వరరావుగారు. అటువంటి గొప్ప వ్యక్తిపై మన అక్కినేని' పేరుతో ఓ చక్కటి ఫొటో బయోగ్రఫీని ప్రముఖ సినీ పరిశోధకుడు సంజయ్‌ కిషోర్‌ తీసుకురావడం చాలా సంతోషకరం'' అని భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు.

మంగళవారం సాయంత్రం విజయవాడలోని స్వర్ణభారతి ట్రస్ట్‌లో ప్రముఖ సినీ పరిశోధకులు సంజయ్‌ కిషోర్‌ రచించి, సేకరించి, రూపొందించిన మన అక్కినేని' పుస్తక ఆవిష్కరణోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకయ్యనాయుడు, గౌరవ అతిథిగా ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, ప్రత్యేక అతిథులుగా ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్, ఏపీ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి, ఆత్మీయ అతిథులుగా కిమ్స్‌' ఛైర్‌పర్సన్‌ బొల్లినేని కృష్ణయ్య, ప్రముఖ సినీ దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ హాజరయ్యారు.

పుస్తకావిష్కరణ అనంతరం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ– అక్కినేనిగారు అంచెలంచెలుగా ఎదిగిన క్రమాన్నీ, వారి జీవితంలో వివిధ పార్శా్వలను చిత్రసమేతంగా మనకు కళ్ళకు కట్టినట్లు మన అక్కినేని' పుస్తకంలో చూపించారు. çపది కాలాల పాటు, పది తరాల పాటు అక్కినేనిగారు ఎలా నిలిచిపోతారో ఈ పుస్తకం చూస్తే తెలిసిపోతుంది. సంజయ్‌ కిషోర్‌లోని కళాత్మక క్రియాశీలత, సృజనాత్మకతకు దర్పణం ఈ పుస్తకం. అక్కినేనివారి గొప్పతనాన్నీ, నాటి తెలుగు సినిమా వైభవాన్నీ మనం చూసుకునే అవకాశాన్ని తన అద్భుతమైన కలెక్షన్స్‌తో ఈ పుస్తకం ద్వారా కల్పించిన సంజయ్‌కిషోర్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను'' అన్నారు.

More News

అప్పుడు ప్రేమ‌మ్‌.. ఇప్పుడు ప్రేత‌మ్‌..

నాగ‌చైత‌న్య కెరీర్‌లో ప్ర‌త్యేకంగా నిలిచిన చిత్రాల‌లో ప్రేమ‌మ్ ఒక‌టి. మ‌ల‌యాళంలో ఘ‌న‌విజయం సాధించిన ప్రేమ‌మ్ చిత్రం ఆధారంగా ఈ సినిమా తెలుగులో రీమేక్ అయ్యింది. గ‌తేడాది అక్టోబ‌ర్ 7న విడుద‌లైన ఈ సినిమా మంచి విజ‌యం సాధించ‌డ‌మే కాకుండా.. చైత‌న్య‌కి న‌టుడిగా మంచి పేరు తీసుకువ‌చ్చింది. ఇప్పుడు  ఇదే నెల‌లో చైత‌న్య‌కి కాబోయే శ్రీ‌&#

మ‌హిళ‌లు వారి కొడుకుల‌ను స‌రిగా పెంచాలి - రేణుదేశాయ్‌

ప‌వ‌న్ క‌ల్యాణ్ మాజీ భార్య ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ త‌న పిల్ల‌ల‌ను చూసుకోవ‌డానికి వ్యక్తి అవ‌స‌రం అంటూ వ్యాఖ్యానించింది. దీనిపై కొంత‌మంది నెగ‌టివ్‌గా మాట్లాడ‌టం, కామెంట్ చేయ‌డం మొద‌లుపెట్టారు. కొంద‌రు ఓ అడుగు ముందుకేసి నువ్వు మా వ‌దిన‌వు, నువ్వు ఇంకో పెళ్లి గురించి ఆలోచిస్తే, నిన్నుద్వేషిస్తామంటూ రేణుకు ఫేస్‌బుక

విలన్‌గా నటించేందుకు సిద్ధం - ఆదిత్య ఓం

'లాహిరి లాహిరి లాహిరిలో' చిత్రంతో పరిచయమై దాదాపు 30 చిత్రాల్లో హీరోగా నటించారు ఆదిత్య ఓం. ఆదిత్య ఓం నటించి, దర్శకత్వం వహించిన 'ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌' గత సంవత్సరం విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.

'హేయ్‌..పిల్ల‌గాడ' సెన్సార్ పూర్తి, అక్టోబ‌ర్‌లో విడుద‌ల

'ఓకే.. బంగారం' సినిమాతో దుల్క‌ర్ స‌ల్మాన్‌, ఇటీవ‌ల విడుద‌లైన సెన్సేష‌న‌ల్ హిట్ అయిన `ఫిదా`తో భానుమ‌తిగా ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేసిన సాయిప‌ల్ల‌వి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యారు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రూపొందిన సినిమా 'క‌లి'. ఈ సినిమాను సూరెడ్డి గోపాలకృష్ణ(యు.ఎస్‌.ఎ) స‌మ‌ర్ప‌ణ‌లో ల‌క్ష్మీ చెన్న‌కేశ‌వ ఫి

రామోజీ ఫిల్మ్ సిటీ లో... పిల్లలతో సందడి చేసిన హీరో సునీల్

కమెడియన్ గా తెలుగు ప్రేక్షకుల్ని  ఎంటర్ టైన్ చేసి  టాలీవుడ్ హీరోగా సుస్థిర స్తానం సంపాదించుకున్న సునీల్ మరో సారి తన దాతృత్వాన్ని చూపించాడు. తన వంతు గా ఎప్పుడు ఎవరు సాయం అడిగిన వారికి హెల్ప్ చేయడం ఆయన నైజం.