close
Choose your channels

హైదరాబాద్‌లో దారుణం.. ప్రియురాలి గొంతుకోసిన ప్రియుడు..!

Tuesday, July 9, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలుగు రాష్ట్రాల్లో రోజుకు ప్రేమ జంటల ఆత్మహత్యలు, జంటపై దాడులు ఎక్కువవుతున్నాయి. నవమాసాలు పెంచి పోషించి పెద్దోళ్లను చేసిన తల్లిదండ్రులను సైతం కాదని ప్రేమ.. ప్రేమ అంటూ యూత్ పరుగులెడుతోంది. తెలిసీ తెలియని వయస్సులో తప్పులు చేసినప్పటికీ.. ఆ తప్పులను సరిచేసుకునే సమయానికి జరగరాని నేరాలు, ఘోరాలు జరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ ప్రేమ వ్యవహారాలు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నాయి. అదేదో సినిమాకు ముందు దూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అన్నట్లు.. ప్రేమ, దోమ ప్రాణానికి హానికరం అంటూ లవ్ సినిమాల్లో.. బస్టాండ్లల్లో రాసుకోవాల్సి వచ్చినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదేమో.

మరీ ముఖ్యంగా.. హైదరాబాద్ వేదికగా వారంలో ఒకట్రెండు ఘటనలు తప్పకుండా ప్రేమ జంటలపై దాడులు, ఆత్మహత్యాయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా.. హైదరాబాద్‌లోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ప్రియురాలి గొంతుకోసి హత్యాయత్నం చేశాడో యువకుడు.. అనంతరం తాను గొంతుకోసుకున్నాడు. ఈ దారుణ ఘటన దిల్‌సుఖ్‌నగర్‌లోని బృందావన్‌ లాడ్జిలో చోటుచేసుకుంది.

అసలేం జరిగింది..!?

మంగళవారం ఉదయం బృందావన్‌ లాడ్జీలోకి నెల్లూరుకు ఓ జంట అద్దెకు దిగింది. నెల్లూరు జిల్లాకు చెందిన వెంకటేశ్‌ (22), హైదరాబాద్‌లోని బడంగ్‌పేటకు చెందిన మనస్విని ఇద్దరికీ ఓ బ్యాంక్‌ కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో పరిచయం ఏర్పడింది. వారిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం.. ప్రేమగా చిగురించింది. అయితే ఎక్కడ తేడా కొట్టిందో తెలియట్లేదు కానీ.. వెంకటేశ్‌ ప్రవర్తన నచ్చని యువతి గత కొంతకాలంగా ప్రియుడికి దూరంగా ఉంటూ వస్తోంది. అయితే ఈ గ్యాప్‌తో మనస్విపై వెంకటేశ్ కోపం పెంచుకున్నాడు. మళ్లీ ఇద్దరూ ఒక్కటయ్యి.. మంగళవారం నాడు దిల్‌సుఖ్‌నగర్‌లోని బృందావన్‌ లాడ్జిలో 501 నంబర్‌ గదిని ఆన్‌లైన్‌లో అద్దెకు తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో మనస్విని (22)కి ఫోన్‌ చేసి రూమ్‌కు రావాలని కోరాడు.

ఇద్దరి పరిస్థితీ విషమం!

ఇద్దరూ కలిసి లాడ్జికి చేరుకుని గతం గురించి చర్చిస్తుండగా.. మాటా మాటా పెరిగింది. దీంతో వెంకటేశ్.. తనదగ్గరున్న కత్తితో యువతి గొంతు కోశాడు. అనంతరం తాను గొంతుకోసుకున్నాడు. ప్రస్తుతం వీరిద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. యువతి సమీపంలోని ఓమ్ని ఆస్పత్రిలో.. యువకుడు ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మనస్వినికి మెడ భాగం కట్‌ అయ్యిందని.. వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసకుని దర్యాప్తు చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment