నూజివీడులో ఇంటింటికీ సరుకులు పంచిన వ్యక్తికి కరోనా
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే ఊహించని రీతిలో కేసులు పెరిగిపోతున్నాయి. తగ్గినట్లే తగ్గి ఒక్కసారిగా కేసులు సంఖ్య పెరుగుతుండటంతో తెలుగు ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఏపీలో ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య 603. ఇదిలా ఉంటే.. లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రభుత్వాలు ఇంటింటికీ నిత్యావసర సరుకులు పంచిపెడుతన్నాయి. అయితే ఏపీలోని కృష్ణా జిల్లా నూజివీడులో ఇంటింటికీ నిత్యావసర సరుకులు పంచిపెట్టిన వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో నూజివీడులో సరుకులు తీసుకున్న జనాలు భయపడిపోతున్నారు.
ప్రజల్లో భయం.. భయం..!
శనివారం నాడు అనుమానంతో వైద్య శిబిరంలో ఛత్తీస్‌గఢ్ వెళ్లిన ఆర్‌ఆర్‌పేటకు చెందిన లారీ డ్రైవర్ రక్త నమూనాలు ఇచ్చారు. పరీక్షల్లో పాజటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లకముందు ఓ రాజకీయ పార్టీకి చెందిన పలు స్వచ్ఛంద కార్యక్రమాల్లో ఆ డ్రైవర్ పాల్గొన్నాడు. అంతేకాదు.. ఆ లారీ డ్రైవర్ గడపగడపకూ కూరగాయలు, కోడిగుడ్లు అందించాడు. సదరు డ్రైవర్ స్థానిక రాజకీయ పార్టీ నాయకుని సమీప బంధువు అని తెలిసింది. లారీ డ్రైవర్‌కు కరోనా పాజిటివ్ రావడంతో పట్టణ ప్రజల్లో భయాందోళన నెలకొంది. ఇదిలా ఉంటే.. నూజివీడులో కరోనా కేసుల సంఖ్య 03కు చేరుకుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. ఈ క్రమంలో నూజివీడు రహదారులను దిగ్బంధం చేస్తున్నట్లు ప్రకటించిన సబ్ కలెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు. మరోవైపు ఇళ్ల నుంచి బయటకు రావొద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే.. ఆ లారీ డ్రైవర్ చేతుల మీదుగా నిత్యావసర సరుకులు తీసుకున్న జనాల పరిస్థితేంటి..? అధికారులు ఈ ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు..? అనేదానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments