సీఎం పాత్రలో మమ్ముట్టి

  • IndiaGlitz, [Thursday,March 01 2018]

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి రాజ‌శేఖ‌ర్ రెడ్డి జీవిత చ‌రిత్ర‌ను సినిమా రూపంలో తెర‌కెక్కించ‌నున్న సంగ‌తి తెలిసిందే. పాఠ‌శాల‌, ఆనందో బ్ర‌హ్మ చిత్రాల ద‌ర్శ‌కుడు మ‌హి వి.రాఘ‌వ్ ఈ సినిమాను డైరెక్ట్ చేయ‌నున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయి. విజ‌య్ చిల్లా, శ‌శి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు.

ఈ సినిమాలో రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాత్ర‌లో మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మ‌మ్ముట్టి న‌టించ‌బోతున్నారని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం. ఈ చిత్రానికి 'యాత్ర' అనే టైటిల్ కూడా ప‌రిశీల‌న‌లో ఉంది. రాజ‌శేఖ‌ర్ రెడ్డి శ్రీమ‌తి విజ‌య‌మ్మ పాత్ర‌లో న‌య‌న‌తార న‌టించ‌బోతున్నార‌ట‌. రీసెంట్‌గా చిత్ర యూనిట్ మమ్ముట్టిని సంప్ర‌దించార‌ట మ‌రి.