వైఎస్సార్ గా మమ్ముట్టి..
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖర్రెడ్డి జీవిత కథ ఆధారంగా ఓ బయోపిక్ తెరకెక్కనుంది. ఈ సినిమాలో వై.యస్.రాజశేఖర్రెడ్డిగా మలయాళ నటుడు మమ్ముట్టి నటించనున్నారు. ఇంతకు ముందు కొన్ని తెలుగు చిత్రాల్లో మమ్ముట్టి నటించారు. కానీ ఇటీవలి కాలంలో మాత్రం ఆయన నటించలేదు.
తాజాగా ఈ సినిమాను అంగీకరించినట్టు సమాచారం. `ఆనందో బ్రహ్మ` వంటి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు గతేడాది బ్లాక్ బస్టర్ ఇచ్చిన మహి.వి.రాఘవ్ ఈ తాజా సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా కథ గురించి ఇప్పటికే మహి.వి.రాఘవ్ జగన్ని సంప్రదించారట. ఎన్నికలు సమీపించే నాటికి ఈ సినిమా ప్రభావం జనాలపై బాగా ఉండాలని జగన్ సూచించినట్టు సమాచారం. మిగిలిన టెక్నీషియన్ల వివరాలు తెలియాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com