చంద్రబాబు ప్రభుత్వం పెగాసస్‌ను కొనుగోలు చేసింది : మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పెగాసస్ వ్యవహారం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతేడాది పార్లమెంట్ సమావేశాల్లో వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారంతో కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు దుమ్మత్తి పోశాయి. న్యాయమూర్తులు, ప్రతిపక్ష నేతలు, మీడియా సంస్థలకు చెందిన వారి ఫోన్ లను కేంద్రం ట్యాపింగ్ చేసిందన్నది ప్రధాన ఆరోపణ. దీనిపై ప్రతిపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇటీవలే పెగాసస్ వ్యవహారానికి సంబంధించి న్యూయార్క్ టైమ్స్ పత్రిక సైతం కథనాన్ని ప్రచురించింది. మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇజ్రాయిల్ పర్యటనలో ఈ డీల్ కుదిరినట్లుగా తెలిపింది. ఈ కథనం అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
ఇలాంటి వ్యవహారంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వివాదాస్పద పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేశారంటూ బాంబు పేల్చారు. బుధవారం బెంగాల్ అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ... నాలుగైదేళ్ల క్రితం పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను రూ.25 కోట్లకు విక్రయిస్తామంటూ దాని సృష్టికర్తలు బెంగాల్ పోలీసులను సంప్రదించారని మమత తెలిపారు. విషయం తనకు తెలిసిన వెంటనే తిరస్కరించానని... ఆ సమయంలో చంద్రబాబు ప్రభుత్వం దానిని కొనుగోలు చేసింది అని మమతా బెనర్జీ వివరించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. మరి దీనిపై చంద్రబాబు, టీడీపీ వర్గాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments