డిసెంబర్ 25న 'మామ మంచు..అల్లుడు కంచు' విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు, అల్లరి నరేష్ హీరోలుగా నటిస్తున్న చిత్రం మామ మంచు..అల్లుడు కంచు`. డా. మోహన్ బాబు కు జంటగా రమ్యకృష్ణ, మీనా నటిస్తున్నారు. అల్లరి నరేష్ కు జతగా పూర్ణ నటిస్తుంది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మంచు విష్ణు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదలువుతుంది.
ఈ సందర్భంగా...
నిర్మాత మంచు విష్ణు మాట్లాడుతూ `నాన్నగారు ఇప్పటి వరకు 561 చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇప్పుడు మామమంచు- అల్లుడు కంచు` సినిమా ఆయన హీరోగా నటించిన 181వ చిత్రం. అలాగే ఈ చిత్రంలో అల్లరి నరేష్,పూర్ణ నటిస్తున్నారు. అల్లరి నరేష్ కు ఈ చిత్రం 50వ సినిమా. డిఫరెంట్ కాంబినేషన్ లో అవుటండ్ అవుంట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ చిత్రం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి సినిమాను చక్కగా డైరెక్ట్ చేస్తున్నారు. సినిమా బాగా వచ్చింది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల చేస్తున్నాం`` అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com