'మామ మంచు.. .అల్లుడు కంచు' సెన్సార్ పూర్తి
Send us your feedback to audioarticles@vaarta.com
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు రమ్యక ష్ణ, మీనా, అల్లరి నరేష్, పూర్ణ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'మామ మంచు...అల్లుడు కంచు. డా.మోహన్‌బాబు, రమ్యక ష్ణ, మీనా కాంబినేషన్లో 23 ఏళ్ళ క్రితం మోహన్‌బాబు, రమ్యక ష్ణ, మీనా కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ సిల్వర్ జూబ్లీ మూవీ అల్లరి మొగుడు చిత్రం తర్వాత ఈ కాంబినేషన్ మరోసారి మ్యాజిక్‌ను క్రియేట్ చేయడానికి రేడీ అయింది. అంతేకాకుండా ఈ జనరేషన్ కామెడి స్టార్ అల్లరి నరేష్ నటించిన 50వ చిత్రం కూడా ఇదే. నరేష్ సరసన పూర్ణ హీరోయిన్గా నటిస్తుంది.
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై మంచు విష్ణు నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస్ రెడ్డి తీర్చిదిద్దారు. సినిమా అనౌన్స్ చేసిన రోజు నుండి సినిమాపై అంచనాలు పెరుగుతూ వచ్చాయి. ఫస్ట్‌లుక్ విడుదల చేయడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇలీవల కోటి, అచ్చు, రఘుకుంచె సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదలైంది. పాటలకు, థియేట్రికల్ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి సినిమాను అవుటండ్ అవుట్ ఎంటర్ టైనర్‌గా రూపొందించారు. మోహన్ బాబు, అల్లరి నరేష్ వంటి డిఫరెంట్ కాంబినేషన్లో అవుటండ్ అవుంట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబరు 25న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ లెవల్లో విడుదల చేస్తున్నారు. సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఎటువంటి కట్స్ లేకుండా 'యు/ఎ' సర్టిఫికేట్‌ను పొందింది. క్రేజీ కాంబినేషన్లో విడుదల కానున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
నటీనటులు: డా.మోహన్‌బాబు, నరేష్; రమ్యక ష్ణ; మీనా, పూర్ణ, వరుణ్ సందేశ్, అలీ, క ష్ణ భగవాన్, జీవా, రాజా రవీంద్ర, సోనియా, సురేఖా వాణి, హ దయ, మౌనిక, ధనరాజ్, చమ్మక్ చంద్ర, ఖయ్యూమ్, సాయి పంపాన, చిట్టిబాబు, అనంత్, సత్తెన్న, దాసన్న, అంబటి శీను
టెక్నిషియన్స్: మాటలు: శ్రీదర్ సీపాన, పాటలు: రామజోగయ్యశాస్త్రీ, అనంత్ శ్రీరామ్, శ్రీమణి, డ్యాన్స్: రాజు సుందరం, బ ంద, శ్రీధర్, విద్యాసాగర్, ఆర్ట్: చిన్నా, ఎడిటర్: గౌతంరాజు, సినిమాటోగ్రఫీ: బాలమురుగన్, సంగీతం: అచ్చు, కోటి, రఘుకుంచె, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజ§్‌ుకుమార్, సమర్పణ: అరియానా, వివియానా, విద్యానిర్వాణ, నిర్మాత: విష్ణుమంచు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనివాసరెడ్డి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments