నరేష్ 50వ సినిమా నిర్మాత కావడం గౌరవంగా ఫీలవుతున్నా - విష్ణు

  • IndiaGlitz, [Sunday,November 29 2015]

డా.మోహన్ బాబు, అల్లరి నరేష్ హీరోలుగా నటిస్తున్న చిత్రం మామ మంచు..అల్లుడు కంచు'. డా. మోహన్ బాబు కు జంటగా రమ్యకృష్ణ, మీనా నటిస్తున్నారు. అల్లరి నరేష్ కు జతగా పూర్ణ నటిస్తుంది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మంచు విష్ణు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదలవుతుంది. కోటి, అచ్చు, ర‌ఘుకుంచె సంగీతం అందించిన ఈ సినిమా పాట‌ల‌ను జంగ్లీ మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుద‌ల చేశారు. టి.సుబ్బిరామిరెడ్డి ఆడియో సీడీల‌ను విడుద‌ల చేయ‌గా, తొలి సీడీని దానం నాగేంద‌ర్ అందుకున్నారు. థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను అంబ‌రీష్‌, సుమ‌ల‌త విడుద‌ల చేశారు.

ఈ సంద‌ర్భంగా..

మోహ‌న్‌బాబు మాట్లాడుతూ మ‌రాఠీ సినిమాను తెలుగులోకి రీమేక్ చేశాం. ద‌ర్శ‌కుడు శ్రీనివాస‌రెడ్డి సినిమాను చ‌క్క‌గా డైరెక్ట్ చేశాడు. సినిమా స‌క్సెస్‌లో మేజ‌ర్ క్రెడిట్ ద‌ర్శ‌కుడికే చెందుతుంది. ఈవివిగారితో నాకు స‌త్సంబంధాలున్నాయి. ఆయ‌న చిన్న కొడుకు న‌రేష్ ఈ చిత్రంలో నాతో పోటీప‌డి న‌టించాడు. ఎవ‌రు బాగా న‌వ్విస్తామో థియేట‌ర్‌లో చూడండి. న‌రేష్ న‌టిస్తున్న 50వ సినిమా ఇది. త‌ను నాకంటే ఎక్కువ సినిమాల్లో న‌టించాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

టి.సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ న‌టుడుగా, నిర్మాత‌గా స‌క్సెస్ అయిన మోహ‌న్‌బాబు ఫ‌ర్‌పెక్ట్ హ్యుమ‌న్ బీయింగ్. చాలా కాలం త‌ర్వాత మోహ‌న్‌బాబు న‌టించిన సినిమా ఇది. అలాగే న‌రేష్ 50వ సినిమా. ఈ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమా పెద్ద స‌క్సెస్ సాధించాలి అన్నారు.

అంబ‌రీష్ మాట్లాడుతూ మోహ‌న్‌బాబు నాకు మంచి మిత్రుడు. మంచి నియ‌మ నిబంధ‌న‌ల‌ను పాటించే వ్య‌క్తి. 40 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకున్న సంద‌ద‌ర్భంగా అభినంద‌న‌లు. యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ అన్నారు.

మంచు విష్ణు మాట్లాడుతూ ఈ సినిమాలో నాన్న‌గారు, నేను చేయాల్సింది. కానీ న‌రేష్ అయితే ఇంకా బాగా ఉంటుంద‌ని అత‌న్ని ఓకే చేయించాం. న‌రేష్ 50వ సినిమాను నిర్మించిన నిర్మాత‌గా హాన‌ర్ ఫీల‌వుతున్నాను అన్నారు.

ద‌ర్శ‌కుడు శ్రీనివాస‌రెడ్డి మాట్లాడుతూ అన్నీ వ‌ర్గాలు చూసే ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌. మోహ‌న్‌బాబుగారు 40 సంత్స‌రాలు న‌ట‌న‌లో పూర్తి చేసుకున్న‌ప్పుడు చేస్తున్న చిత్ర‌మిది. అలాగే న‌రేష్ 50 వ సినిమా కూడా ఇదే కావ‌డం నా అదృష్టం అన్నారు.

ఈ కార్య‌క్ర‌కంలో ర‌మ్య‌కృష్ణ‌, మీనా, ల‌క్ష్మీ ప్ర‌స‌న్న‌, మంచు మ‌నోజ్‌, బ్ర‌హ్మానందం, రాజార‌వీంద్ర త‌దిత‌రులు పాల్గొని యూనిట్ ను అభినందించారు.

డా.మోహన్ బాబు, నరేష్, రమ్యకృష్ణ, మీనా, పూర్ణ, వరుణ్ సందేశ్, అలీ, కృష్ణభగవాన్, జీవా, రాజా రవీంద్ర, సోనియా,సురేఖా వాణి, హృదయ, మౌనిక, ధనరాజ్, చమ్మక్ చంద్ర , ఖయ్యూమ్, సాయి పంపాన, చిట్టిబాబు, అనంత్, సత్తెన్న,దాసన్న, అంబటి శీను కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రానికి మాటలు: శ్రీదర్ సీపాన, పాటలు: రామజోగయ్యశాస్త్రి, అనంత్ శ్రీరామ్, శ్రీమణి, డ్యాన్స్: రాజు సుందరం, బృంద, శ్రీధర్,విద్యాసాగర్, ఆర్ట్: చిన్నా, ఎడిటర్: గౌతంరాజు, సినిమాటోగ్రఫీ: బాలమురుగన్, సంగీతం: అచ్చు, రఘకుంచె, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్ కుమార్, సమర్పణ: అరియానా, వివియానా, విధ్యానిర్వాణ, నిర్మాత: విష్ణు మంచు, స్ర్కీన్ ప్లే,దర్శకత్వం: శ్రీనివాస రెడ్డి.