మామ మంచు అల్లుడు కంచు రిలీజ్ డేట్ ఫిక్స్
Send us your feedback to audioarticles@vaarta.com
మంచు మోహన్ బాబు, అల్లరి నరేష్ కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ మామ మంచు అల్లుడు కంచు. ఈ మూవీని ఢమరుకం ఫేం శ్రీనివాసరెడ్డి తెరకెక్కిస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై విష్ణు నిర్మిస్తున్నారు. మోహన్ బాబు, రమ్యక్రిష్ణ, మీనా ఈ ముగ్గురు కలసి అల్లరి మొగుడు సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మోహన్ బాబు, రమ్యక్రిష్ణ, మీనా, అల్లరి నరేష్, పూర్ణ కాంబినేషన్లో మామ మంచు అల్లుడు కంచు సినిమాని రూపొందిస్తున్నారు.
561 సినిమాల్లో నటించిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకి ఈ సినిమా హీరోగా 181వ చిత్రం కాగా, అల్లరి నరేష్ ఈ మూవీ 50వ సినిమా కావడం విశేషం.ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న మామా మంచు అల్లుడు కంచు సినిమాని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాత విష్ణు తెలియచేసారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com