మామ మంచు అల్లుడు కంచు రిలీజ్ డేట్ ఫిక్స్

  • IndiaGlitz, [Saturday,October 24 2015]

మంచు మోహ‌న్ బాబు, అల్ల‌రి న‌రేష్ కాంబినేష‌న్ లో రూపొందుతున్న మూవీ మామ మంచు అల్లుడు కంచు. ఈ మూవీని ఢ‌మ‌రుకం ఫేం శ్రీనివాస‌రెడ్డి తెర‌కెక్కిస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్ పై విష్ణు నిర్మిస్తున్నారు. మోహ‌న్ బాబు, రమ్య‌క్రిష్ణ‌, మీనా ఈ ముగ్గురు క‌ల‌సి అల్ల‌రి మొగుడు సినిమాలో న‌టించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు మోహ‌న్ బాబు, ర‌మ్య‌క్రిష్ణ‌, మీనా, అల్లరి న‌రేష్, పూర్ణ కాంబినేష‌న్లో మామ మంచు అల్లుడు కంచు సినిమాని రూపొందిస్తున్నారు.

561 సినిమాల్లో నటించిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకి ఈ సినిమా హీరోగా 181వ చిత్రం కాగా, అల్ల‌రి న‌రేష్ ఈ మూవీ 50వ సినిమా కావ‌డం విశేషం.ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతున్న మామా మంచు అల్లుడు కంచు సినిమాని క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 25న రిలీజ్ చేస్తున్న‌ట్టు నిర్మాత విష్ణు తెలియ‌చేసారు.

More News

హ‌రిక‌థ రిలీజ్ డేట్ ఫిక్స్

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ న‌టించిన శివ‌మ్ సినిమా ప్లాప్ అవ్వ‌డంతో...నెక్ట్స్ మూవీ హ‌రిక‌థ పై చాలా కేర్ తీసుకుంటున్నాడ‌ట‌.

గోపిచంద్ హీరోగా 'మహాప్రస్థానం'

ప్రస్తుతం ‘సౌఖ్యం’ చిత్రంతో బిజీగా ఉన్న హీరో గోపిచంద్ క్రిస్మస్ రోజున మన ముందుకు రానున్నాడు. ఈ సినిమా తర్వాత దేవాకట్టా దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు.

వ‌రుణ్ కి ఆమెతో న‌టించాల‌ని ఉంద‌ట‌

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌యుడు వరుణ్ తేజ్ న‌టించిన తాజా చిత్రం కంచె. రెండ‌వ ప్ర‌పంచ యుద్ధం నేప‌ధ్యంతో తెర‌కెక్కిన కంచె ద‌స‌రా కానుక‌గా రిలీజైంది.

నాని పాత్ర‌లో జి.వి.ప్ర‌కాష్

నాని పోషించిన పాత్ర‌ను జి.వి.ప్ర‌కాష్ పోషిస్తున్నార‌ట‌. ఇంత‌కీ ఏ పాత్ర‌ను అనుకుంటున్నారా...? ఇటీవ‌ల నాని న‌టించిన చిత్రం భ‌లే భ‌లే మ‌గాడివోయ్. క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిన ఈ సినిమా ఘ‌న విజయం సాధించిన విష‌యం తెలిసిందే.

అక్కినేని - ద‌గ్గుబాటి క‌లిసి న‌టిస్తున్నార‌ట‌..

అక్కినేని ఫ్యామిలీ హీరో కింగ్ నాగార్జున‌, ద‌గ్గుబాటి ఫ్యామిలీ హీరో విక్ట‌రీ వెంక‌టేష్‌...వీళ్లిద్ద‌రు క‌లిసి న‌టిస్తున్నార‌ట‌.గ‌తంలో వీరిద్ద‌రు క‌ల‌సి న‌టిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.