‘మలుపు’ హీరోయిన్‌తో ఆది పినిశెట్టి పెళ్లి?

  • IndiaGlitz, [Thursday,July 30 2020]

టాలీవుడ్, కోలీవుడ్ అన్న తేడా లేకుండా రెండు వర్గాల ప్రేక్షకులకూ దగ్గరైన నటుడు ఆది పినిశెట్టి. విలన్‌గానూ.. హీరోగానూ.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా ది బెస్ట్ అనిపించుకున్నాడు. ‘రంగస్థలం’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు ఆది మరింత దగ్గరయ్యాడు. ఈ సింపుల్ అండ్ స్వీట్ హీరో త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నాడనేది కోలీవుడ్ టాక్. ‘మలుపు’ హీరోయిన్‌ నిక్కీ గల్రానీని ఆది పెళ్లి చేసుకోబోతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆది, నిక్కీ జంటగా ‘మలుపు’, ‘మరకతమణి’ సినిమాల్లో నటించారు.

అప్పటి నుంచే వీరిద్దరి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారినట్టు టాక్. కొంతకాలంగా ఈ జంట డేటింగ్‌లో ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఆది తండ్రి రవిరాజా పినిశెట్టి పుట్టినరోజు వేడుకలకు కూడా నిక్కీ హాజరవడం.. ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. కరోనా కంట్రోల్ అవగానే వీరి పెళ్లి ప్రకటన రానుందని తెలుస్తోంది. అయితే వీరిద్దరి ప్రేమ, డేటింగ్, పెళ్లి అంటూ జరుగుతున్న ప్రచారంపై ఇప్పటివరకూ వీరిలో ఏ ఒక్కరూ స్పందించలేదు.