Malls and Shop:తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇకపై 24 గంటలూ షాపులు, మాల్స్ ఓపెన్
Send us your feedback to audioarticles@vaarta.com
సాధారణంగా ఎక్కడైనా దుకాణాలు ఉదయం 10 గంటలకు తెరచుకుని రాత్రి 10 .. కొన్ని చోట్ల 11 గంటల వరకు అందుబాటులో వుంటాయి. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇదే సూత్రాన్ని అందరూ ఫాలో అవుతారు. అయితే తొలిసారిగా తెలంగాణ రాష్ట్రం రూల్స్ బ్రేక్ చేయనుంది. అన్ని దుకాణాలు, వ్యాపార సముదాయాలు 24 గంటలు తెరిచేలా ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని పేరుతో జీవో విడుదలైంది. అయితే ఇందుకోసం ప్రతి యేటా ప్రభుత్వానికి పదివేల రూపాయలు చెల్లించాల్సి వుంటుంది. ఇందుకోసం తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ 1988కు సవరణలు చేసింది. ఇందుకు సంబంధించి ఈ నెల 4నే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా.. శుక్రవారం రాత్రి వెలుగులోకి వచ్చాయి.
24 గంటల షాపులు తెరవాలంటే ఈ నిబంధనలు పాటించాల్సిందే:
అయితే 24 గంటలు షాపులు తెరిచేందుకు అయా యాజమాన్యాలు ప్రత్యేక నిబంధనలు పాటించాల్సి వుంటుంది. సిబ్బందికి ఐడీ కార్డులతో పాటు వీక్లీ హాలిడేస్ ఇవ్వాలి. నిబంధనలకు అనుగుణంగా వున్న పనిగంటల్లో వారితో పని చేయించుకోవాలి. ఓవర్ టైం చేస్తే దానికి వేతనం ఇవ్వాలి. మహిళా ఉద్యోగులకు అంగీకారమైతేనే డ్యూటీలు వేయాలి.. ఇందుకోసం ప్రత్యేక వేతనం, భద్రత కల్పించాలి. పోలీస్ వారు ఇచ్చే నిబంధనలను ఫాలో అవ్వాల్సి వుంటుంది. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చాలన్న ప్రభుత్వ ప్రణాళికలో భాగంగానే 24 గంటలు దుకాణాల కాన్సెప్ట్‌ను అమల్లోకి తెచ్చినట్లుగా తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments