ఇన్నేళ్లకు తొలిసారి టాలీవుడ్‌లో అడుగుపెడుతున్న బాలీవుడ్ హాట్ బాంబ్
Send us your feedback to audioarticles@vaarta.com
మల్లికా శెరావత్.. ఈ పేరు వింటే బోల్డ్ లుక్స్, హాట్ హాట్ అందాలు, కైపెక్కించే చూపులు గుర్తొస్తాయి. ఈ అమ్మడు ఉత్తరాది హీరోయిన్ అయినప్పటికి భారతదేశమంతా కోట్లాది మంది అభిమానులు వున్నారు. ‘ఖ్వాహిష్’(2003)తో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చిన మల్లికా శెరావత్.. ఆ తర్వాత విడుదలైన ‘మర్డర్’ సినిమాతో బోల్డ్ నటిగా పాపులర్ అయ్యారు. ఈ రెండు చిత్రాల్లోనూ ఓవర్ డోస్ గ్లామరస్ షోతో విమర్శలు వెల్లువెత్తినా తనదైన శైలిలోనే ఆమె ముందుకు వెళ్లారు.
బాలీవుడ్‌తో పాటు అప్పట్లోనే హాలీవుడ్ లోనూ సినిమాలు చేసి ఔరా అనిపించింది. ముఖ్యంగా యాక్షన్ స్టార్ జాకీచాన్ నటించిన “ది మిత్” సినిమాలోనూ మెరిసింది. పెళ్లి తరువాత కొన్నాళ్ళకు సినిమాలకు దూరమైన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మళ్ళీ చిత్ర పరిశ్రమపై దృష్టి పెట్టింది. అంతేకాదు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఇన్నేళ్లకు టాలీవుడ్ అరంగ్రేటం చేయబోతోంది.
పీరియాడికల్ డ్రామా కథాంశంతో తెరకెక్కనున్న నాగమతి అనే చిత్రంలో మల్లికా కీలక పాత్ర పోషించనుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అమ్రిష్ గణేశ్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి నిర్మిస్తున్నారు. ముంబైలో ఇటీవల ఈ చిత్రం గ్రాండ్‌గా లాంచ్ కాగా, త్వరలోనే మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఇందులో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణులు , తదితర విషయాలపై త్వరలోనే క్లారిటీ రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments