ఇన్నేళ్లకు తొలిసారి టాలీవుడ్‌లో అడుగుపెడుతున్న బాలీవుడ్ హాట్ బాంబ్

  • IndiaGlitz, [Thursday,November 11 2021]

మల్లికా శెరావత్.. ఈ పేరు వింటే బోల్డ్ లుక్స్, హాట్ హాట్ అందాలు, కైపెక్కించే చూపులు గుర్తొస్తాయి. ఈ అమ్మడు ఉత్తరాది హీరోయిన్ అయినప్పటికి భారతదేశమంతా కోట్లాది మంది అభిమానులు వున్నారు. ‘ఖ్వాహిష్‌’(2003)తో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చిన మల్లికా శెరావత్‌.. ఆ తర్వాత విడుదలైన ‘మర్డర్‌’ సినిమాతో బోల్డ్‌ నటిగా పాపులర్ అయ్యారు. ఈ రెండు చిత్రాల్లోనూ ఓవర్ డోస్ గ్లామరస్‌ షోతో విమర్శలు వెల్లువెత్తినా తనదైన శైలిలోనే ఆమె ముందుకు వెళ్లారు.

బాలీవుడ్‌తో పాటు అప్పట్లోనే హాలీవుడ్ లోనూ సినిమాలు చేసి ఔరా అనిపించింది. ముఖ్యంగా యాక్షన్ స్టార్ జాకీ‌చాన్ నటించిన “ది మిత్” సినిమాలోనూ మెరిసింది. పెళ్లి తరువాత కొన్నాళ్ళకు సినిమాలకు దూరమైన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మళ్ళీ చిత్ర పరిశ్రమపై దృష్టి పెట్టింది. అంతేకాదు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఇన్నేళ్లకు టాలీవుడ్ అరంగ్రేటం చేయబోతోంది.

పీరియాడికల్ డ్రామా కథాంశంతో తెరకెక్కనున్న నాగమతి అనే చిత్రంలో మ‌ల్లికా కీలక పాత్ర పోషించ‌నుంద‌ని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అమ్రిష్ గణేశ్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి నిర్మిస్తున్నారు. ముంబైలో ఇటీవల ఈ చిత్రం గ్రాండ్‌గా లాంచ్ కాగా, త్వ‌ర‌లోనే మూవీ సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఇందులో న‌టించే న‌టీనటులు, సాంకేతిక నిపుణులు , త‌దిత‌ర విష‌యాల‌పై త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది.

More News

ప్రముఖ కొరియోగ్రాఫర్ కన్నుమూత.. విషాదంలో చిత్ర పరిశ్రమ

భారతీయ చిత్ర పరిశ్రమను వరుస మరణాలు వెంటాడుతున్నాయి.

ప్రారంభమైన మెగాస్టార్ 'భోళా శంక‌ర్ '.. 15 నుండి రెగ్యుల‌ర్ షూటింగ్, క్యాస్ట్ అండ్ క్రూ ఇదే

మెగాస్టార్ చిరంజీవి తన సినిమాల జోరు పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆచార్యను పూర్తి చేసిన ఆయన.. భోళా శంకర్,

'పుష్పక విమానం' చిత్రంలో పెళ్లి గురించి ఓ మంచి విషయం చెబుతున్నాం - హీరో ఆనంద్ దేవరకొండ

"దొరసాని", "మిడిల్ క్లాస్ మెలొడీస్" చిత్రాలతో టాలెంటెడ్ హీరోగా అటు ఇండస్ట్రీలో ఇటు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నారు ఆనంద్ దేవరకొండ.

బిగ్ బాస్ 5 తెలుగు : శ్రీరామ్‌కు సోనూసూద్ సపోర్ట్… టైటిల్ గెలిచినట్లేనా ?

బుల్లితెర‌పై ప్రసారమవుతున్న ప్రముఖ రియాలిటీ షో “బిగ్ బాస్ తెలుగు 5” ఆసక్తికరంగా కొనసాగుతోంది.

రిలేషన్ గురించి వెంకటేశ్‌ పోస్ట్‌.. సమంతా- నాగచైతన్య గురించేనా..?

టాలీవుడ్ స్టార్ కపుల్ సమంత - నాగచైతన్య విడాకులు తీసుకుని విడిపోయిన ఘటనను తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు వారి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.