మళ్ళీ రావా గ్రాండ్ సక్సెస్ మీట్
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీ నక్క యాదగిరి స్వామి ఆశీస్సులతో స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సుమంత్ హీరోగా, ఆకాంక్ష సింగ్ ప్రధాన పాత్ర దారులుగా గౌతమ్ తిన్న సూరి దర్శకత్వంలో రాహుల్ నక్క నిర్మించిన రొమాంటిక్ డ్రామా 'మళ్లీ రావా'. ఈ చిత్రం డిసెంబర్ 8న బ్యూటీఫుల్ మ్యూజికల్ లవ్ స్టోరీ గా నిలిచి విజయపథంలో దూసుకు పోతూ ప్రేక్షాకాదరణ పొందుతున్న తరుణం లో మళ్ళీ రావా చిత్ర యూనిట్ గ్రాండ్ సక్సెస్ మీట్ ను మరియు మధురా ఆడియో ద్వారా మొమెంటో లను ప్రధాన కార్యక్రమాన్ని గురువారం ప్రసాద్ ల్యాబ్ లో గ్రాండ్ గా నిర్వహించారు.
ఈ నేపథ్యం లో హీరో సుమంత్ మాట్లాడుతూ... నేనెప్పుడూ సక్సెస్, ఫెయిల్యూర్స్ కు రియాక్ట్ అవ్వను. దేనినైనా బ్యాలెన్సుడ్ గా తీసుకుంటాను. కానీ మళ్ళీ రావా సినిమా చేసినందుకు చాలా తృప్తిగా ఉన్నాను. స్టోరీ బాగా నచ్చింది కనుకే నమ్మాను. ఇప్పుడు ఆ నమ్మకమే ఇంతటి మంచి ఫలితాన్ని అందించింది. గౌతమ్ లాంటి ఒక మంచి రైటర్ ను దర్శకుడిని పరిచయం చేశామని గర్వంగా ఉంది. నిర్మాత రాహుల్ కు ఎలాంటి అనుభవం లేకున్నా సక్సెస్ ను సాధించి చూపించాడు... మా అన్నపూర్ణ స్టూడియో నుంచి నా సిస్టర్ సుప్రియ కాల్ చేసి అప్ప్రీషియేట్ చేసింది... అంతే కాదు ఇండస్ట్రీ నుంచి వస్తున్న అప్ప్రీషియేషన్స్ ఫోన్ చూసి... చూసి... ఫోన్ కూడా పాడు చేసాను. కొత్త ఫోన్ కొనాలిప్పుడు. అందుకు హ్యాపీ గా ఉంది, ఈ సినిమాలో ముఖ్యంగా మ్యూజిక్ హై లెట్ అయ్యింది.. మ్యూజికల్ లవ్ స్టోరీ గా ప్రేక్షకాదరణ పొందుతున్నందుకు సంతోషిస్తున్నా.. టీమ్ మొత్తానికి కంగ్రాజులేషన్స్ తెలియచేస్తున్నా అన్నారు.
నిర్మాత నక్కా రాహుల్ యాదవ్ మాట్లాడుతూ.... ఈ సినిమాను ఎంత నమ్మమ్మో అంత కంటే మంచి ఫలితం దక్కినందుకు హ్యాపీగా ఉన్నాం... ఈ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరు తమ ఓన్ బ్యానర్ లా ఫీల్ అయ్యి కస్టపడి పని చేశారు.. అందుకే అందరికీ ఆడియోన్స్ నుంచి సమానమైన మంచి పేరు వస్తోంది. అందుకు గర్వాంగా ఫీల్ అవుతున్నా... మా సినిమాను ఆదరించిన ప్రేక్షుకులకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నా అన్నారు. ఇక దర్శకుడు గౌతమ్ మాట్లాడుతూ నన్ను నమ్మి నాకు సహకరించిన హీరో సుమంత్ గారికి, నిర్మాత విజయ్ గారికి నేను కృతజ్ఞతలు తెలియచేస్తున్నా... ఇండస్ట్రీ నుంచి మంచి అప్ప్రీషియేషన్స్ వస్తున్నాయి... టీమ్ సక్సెస్ గా నేను భావిస్తున్నా.. ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ని ఇప్పటికీ ఆదరిస్తున్నందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలని తెలిపారు.
మధుర శ్రీధర్, మిర్చి కిరణ్, మాస్టర్ సాత్విక్, అన్నపూర్ణ, సత్య గిడుతూరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అభినందనలను, కృతజ్ఞతలను తెలియచేసారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout