Malli Raava Review
కొన్ని సినిమాలకు టైటిల్స్ పెట్టినప్పటి నుంచే క్రేజ్ మొదలవుతుంది. తాజాగా అలాంటి క్రేజ్‌ని సొంతం చేసుకున్న సినిమా `మళ్లీరావా`. `నరుడా డోనరుడా` తర్వాత తెరకెక్కుతోన్న సినిమా. ఈ సినిమా గురించి ఆల్రెడీ పాజిటివ్ బజ్ మొదలైంది. సినిమా యూనిట్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ సినిమాను మెచ్చుకుంటూ ఉన్నారు. తాను మామూలు కథల మీద మనసు పడనని, గొప్ప కథలైతేతే చేస్తానని ఈ మధ్య కూడా సుమంత్ చెప్పారు. ఇది నిజంగా అంత మంచి కథేనా? `మళ్లీరావా` ఇంతకీ ఎలా ఉంది.. ఓ సారి చదివేయండి.
కథ:
కార్తిక్ (సుమంత్), అంజలి (ఆకాంక్ష సింగ్) ఇద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుంటారు. తొమ్మిదో తరగతి నుంచే ఒకరంటే ఒకరికి ఇష్టం. ఆ ఇష్టం వారిద్దరి మధ్య ప్రేమ పుట్టిస్తుంది. పరిస్థితులు ఆ ప్రేమను పెళ్లి వరకు వెళ్లనీయకుండా అడ్డుపడుతుంటాయి. ఆ పరిస్థితులు కూడా బాహ్యమైనవి కావు. మానసిక సంఘర్షణలు, భయాందోళనలే. అలాంటి పరిస్థితుల్లో ఆ ఇద్దరు ఇలాంటి మానసిక ఇబ్బందులను దాటుకుని పెళ్లిపీటల వరకు వెళ్లారా లేదా? అసలు `మళ్లీరావా` అని ఎవరు ఎవరితో అన్నారు? ఎందుకు అన్నారు? అనేది ఆసక్తికరం.
ప్లస్ పాయింట్లు:
చిన్నప్పటి కార్తిక్, సుబ్బు, అంజలి పాత్రలు చేసిన పిల్లలు ముగ్గురూ చక్కగా నటించారు. సుమంత్, అంజలి, కార్తిక్ ముగ్గురూ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఈ సినిమాలో కొత్త స్క్రీన్‌ప్లే వాడారు. డైలాగులు అక్కడక్కడా బావున్నాయి. పాటలు పాటల్లా కాకుండా సినిమాలో బ్యాక్‌గ్రౌండ్‌లో భాగంగా మిళితం చేశారు. కామెడీ సన్నివేశాలు బాగున్నాయి. ముఖ్యంగా మిర్చి కిరణ్ ఆఫీస్ ఎపిసోడ్, ఎప్పుడూ ఇయర్ ఫోనుల్లో మాట్లాడే డైలాగులు బావున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాకు హైలైట్ అయింది. సుమంత్ ఫ్రెండ్స్ గా నటించిన కుర్రాళ్లు కూడా చక్కగా నటించారు. మిర్చీ కిరణ్ పెర్ఫార్మెన్స్ బావుంది. ఆయనకు ఇది మంచి ఎంట్రీ ఫిల్మ్.
మైనస్ పాయింట్లు:
సినిమాపై మనసు పెట్టి ఏ సన్నివేశం ఎప్పుడు జరిగిందో ప్రేక్షకుడు పోల్చుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఆ కొంత సమయంలో జరిగే సన్నివేశాలు కాసింత గందరగోళానికి గురి చేస్తాయి. కథాపరంగా ఆలోచించినా ఇదేం కొత్త కథ కాదు. నాగచైతన్య నటించిన ఎటో వెళ్లిపోయింది మనసు తరహా చిత్రమే ఇది. పాటలు కూడా తెరపై బాగానే అనిపించినా ఏదీ బయట పాడుకోతగ్గట్టు ఉండదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాకు హైలైట్ అయింది. సుమంత్ ఫ్రెండ్స్ గా నటించిన కుర్రాళ్లు కూడా చక్కగా నటించారు. మిర్చీ కిరణ్ పెర్ఫార్మెన్స్ బావుంది. ఆయనకు ఇది మంచి ఎంట్రీ ఫిల్మ్.
సమీక్ష:
ప్రేమ, డెస్టినీ వేర్వేరుగా ఉండొచ్చు...కలవొచ్చు. ప్రేమలో ఈ రెండింటి కలయిక అనేది రెండు హృదయాల మానసిక సంఘర్షణను తెలియజేసే అంశం. అలాంటి అంశంతో దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తయారు చేసుకున్న కథే ` మళ్ళీ రావా`. ఇద్దరు ప్రేమికులు ..పరిస్థితులు కారణంగా వారి విడిపోవడం, కలవడం కామన్‌గా జరుగుతూ ఉంటుంది. ఈ కాన్సెప్ట్‌పై చాలా చిత్రాలుతెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో కొన్ని సక్సెస్ అయ్యాయి. మరికొన్ని అనుకున్నంత మేర సక్సెస్ కాలేకపోయాయి. వాటికి కారణాలేమైనా కావచ్చు. కానీ ప్రేమకథ ఎప్పుడైనా కొత్తగానే ఉంటుంది. అయితే అది చెప్పే తీరుపై ఆధారపడి ఉంటుంది. దర్శకుడు ఎమోషన్స్‌ను వెండితెరపై ఎలా చూపించాడనేదే ప్రేక్షకుడు చూస్తాడు. దర్శకుడు గౌతమ్ ఈ విషయంలో మంచి విజయాన్ని సాధించాడు. ఎమోషన్స్‌ను చక్కగా ప్రెజెంట్ చేశాడు. తనేం చెప్పాలనుకున్నాడనే విషయాన్ని చాలా క్లారిటీతో చెప్పాడు. సుమంత్, ఆకాంక్ష, కార్తీక్ అడుసుమిల్లి వంటి నటీనటులు ఈ ప్రయత్నాన్ని సక్సెస్ చేసే ప్రయత్నంలో తమ వంతు పాత్రలను సమర్ధ వంతంగా పోషించాడు. ముఖ్యంగా సుమంత్ చాలా కాలం తర్వాత మంచి ప్రేమకథలో నటించాడు. తన నటనతో ఆకట్టుకున్నాడు. ఆకాంక్ష తొలి సినిమానే అయినా నటన పరంగా మంచి మార్కులనే సంపాదించుకుంది. అన్నపూర్ణమ్మ క్యారెక్టర్ కూడా బావుంది. సుమంత్ స్నేహితుడి పాత్రలో కార్తీక్ అడుసుమిల్లి చక్కగా నటించాడు. తనకు ఇంకా మంచి పాత్రలు వస్తాయనడంలో సందేహం లేదు. ఇక మిర్చి కిరణ్ కామెడీ ప్రేక్షకులను నవ్విస్తుంది. దర్శకుడి పనితనానికి శ్రవణ్ నేపథ్య సంగీతం బలాన్ని అందించింది. అలాగే సతీష్ ముత్యాల తన విజువల్స్‌తో సినిమాకు రిచ్‌నెస్ తెచ్చాడు. నిన్ను కలిస్తే ఉండే బాధ కన్నా, నిన్ను కలిస్తే ఎక్కడ విడిపోతానో అనే భయం ఇంకా ఎక్కువగా ఉంది ...అనే సంభాషణలు ఫీల్‌లో డెప్త్‌ను తెలియజేస్తాయి. సినిమా స్లోగా ఉంటుంది. మాస్ ఎలిమెంట్స్‌ను కోరుకునే ప్రేక్షకులకు సినిమా నచ్చదు. అయితే మంచి ప్రేమకథను చూడాలనుకునే ప్రక్షకులు ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారనడంలో సందేహం లేదు.
బ్యాటమ్ లైన్: నేటి తరం యువత ప్రేమలో ఉన్నప్పుడు వారు పడే మానసిక సంఘర్షణను తెలియజేసే చిత్రమే `మళ్ళీ రావా`
'Malli Raava' Movie Review in English
- Read in English