ప్రభాస్ సరసన ‘మల్లీశ్వరి’ బ్యూటీ!
Send us your feedback to audioarticles@vaarta.com
‘బాహుబలి’లాంటి భారీ సినిమాతో వరల్డ్ ఫేమస్ అయిన ప్రభాస్.. ‘మహానటి’ సినిమా తనకంటూ ఓ క్రేజ్ దక్కించుకున్న నాగ్ అశ్విన్ కాంబోలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్లో సి.అశ్వినీదత్ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నాడు. అయితే ఈ కాంబోలో సినిమా ఎలా ఉంటుంది..? కథ ఎలా ఉండబోతోంది..? అనేదానిపై ఇటు టాలీవుడ్లో.. అటు సోషల్ మీడియా.. మరీ ముఖ్యంగా ప్రభాస్ అభిమానుల్లో సర్వత్రా చర్చ జరుగుతోంది.
మరో వైపు ప్రభాస్ సరిపడే.. డార్లింగ్‌తో రొమాన్స్ చేసే బ్యూటీ ఎవరబ్బా..? టాలీవుడ్ నుంచే తీసుకుంటారా..? లేకుంటే ‘సాహో’కు పట్టుకొచ్చినట్లుగానే బాలీవుడ్ భామనే పట్టుకొస్తారా..? అనే దానిపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇదివరకే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన దీపిక పదుకుణె నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ మేరకు ఇటీవలే ఆమె మేనేజర్‌ను సంప్రదించి అపాయిట్మెంట్ తీసుకున్న నాగీ.. కథ వినిపించాడని కూడా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా.. దీపికా షాకివ్వడంతో మరో బాలీవుడ్ బ్యూటీని పట్టారని తెలుస్తోంది.
ఆ బ్యూటీ మరెవరో కాదండోయ్.. కత్రినా కైఫ్ అని విశ్వసనీయ వర్గాల సమాచారం. కత్రినాతో సంప్రదింపులు జరుపగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా.. తెలుగులో కత్రినా నటించడం కొత్తేమీ కాదు.. గతంలో తెలుగులో విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన ‘మల్లీశ్వరి’ సినిమాలో మొదటిసారిగా నటించి మెప్పించింది. ఈ సినిమాతో చాలా మంది తెలుగు ప్రేక్షకులను పొందింది. అనంతరం ‘అల్లరి పిడుగు’ సినిమాలో కూడా నటించింది. అయితే.. ఆ తర్వాత బాలీవుడ్లో కత్రినా బిజిబిజీగా ఉంది. తెలుగులో అవకాశం వస్తే నటించడానికి సిద్ధంగా ఉందని తెలుసుకున్న నాగీ.. ఆమెను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో నిజానిజాలెంతో అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com